నాగశౌర్య.. లక్ష్మీ రావె మా ఇంటికి, ఊహలు గుసగుసలాడే, జ్యో అచ్యుతానంద, ఛలో, అమ్మమ్మ గారిల్లు, వరుడు కావలెను, ఓ బేబీ, అశ్వత్థామ వంటి చిత్రాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇండస్ట్రీలోకి వచ్చి 14 ఏళ్లయినా ఒకట్రెండు సినిమాలు తప్ప చెప్పుకోవడానికి పెద్ద హిట్లు లేవనే చెప్పాలి. అయితే ‘నాగశౌర్య చిన్నప్పుడే.. పెళ్లయ్యాక మాత్రం నేను కలిసుండను అనేవాడు.
ఎందుకురా అంటే ఇద్దరు మంచివాళ్లు ఒక్క దగ్గర ఉండకూడదని చెప్పేవాడు. మొదటి నుంచి అదే అనుకున్నాం. అందుకే పెళ్లయ్యాక కొడుకు-కోడలు వేరే ఇంట్లో ఉంటున్నారు. నాగశౌర్యకు గతేడాది పాప పుట్టింది. గత నవంబర్లోనే మనవరాలి మొదటి పుట్టిన రోజు గ్రాండ్ గా సెలబ్రేట్ చేశాం. తరచూ తనను వీడియో కాల్లో చూస్తుంటాను. కానీ తనను చాలా మిస్ అవుతున్నాను.

‘చిన్నప్పుడు శౌర్యతో పాటు నా మరో కుమారుడికి ఆస్తమా ఉండేది. ఆ కారణంగా ఎక్కువగా స్కూలుకు వెళ్లేవారు కాదు. నేను నా పిల్లలను ఇంట్లోనే చదివించేదాన్ని. రోజంతా వారితోనే ఉండేదాన్ని. అలాంటిది ఇప్పుడు పిల్లల పెళ్లయ్యాక ఇల్లంతా బోసిపోయినట్లనిపిస్తోంది. ఇలాంటి రోజొకటి వస్తుందని తెలుసు’ అంటూ కొన్ని రోజుల క్రితం ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయ్యారు ఉషా.
నాగశౌర్య తల్లి ఉష ప్రొడక్షన్ కంపెనీతోపాటు రెస్టారెంట్ బిజినెస్ కూడా నిర్వహిస్తున్నారు. ఇప్పుడు ఆమెకు నగరంలో పలు రెస్టారెంట్లు ఉన్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం మూడు సినిమాల్లో నటిస్తున్నాడు నాగ శౌర్య. పోలీస్ వారి హెచ్చరిక, బ్యాయ్ బాయ్ కార్తీక్ తో పాటు నారీ నారీ నడుమ మురారీ అనే సినిమాలతో బిజీగా ఉంటున్నాడు నాగ శౌర్య.
ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.