ఎన్నో సినిమాల్లో విలన్ పాత్రలు పోషించిన సోనూ సూద్ నిజ జీవితంలో రియల్ హీరోగా వెలుగొందుతున్నాడు. కరోనా సమయంలో వేలమందికి అండగా నిలిచి తన గొప్ప మనసును చాటుకున్నారాయన. కరోనా తర్వాత పరిస్థితులు మెరుగు పడినా తన సమాజ సేవను కొనసాగిస్తున్నారు. సొంతంగా ‘సోనూ ఫౌండేషన్’ స్థాపించి అడిగిన వారందరికీ ఏదో ఒక విధంగా సాయం చేస్తున్నాడు. ఇందులో భాగంగా పేద విద్యార్థులకు ఆర్థిక సాయం కూడా అందజేస్తున్నారు.
అయితే దేశంలో కోవిడ్ సమయంలో నిరుపేదలు, వలస కూలీలు ఆకలితో అల్లలాడిపోయారు. ఉండేందుకు చోటు లేకుండా, కనీసం మంచినీటి సౌకర్యం లేకుండా ఎన్నో ఇబ్బందులు పడ్డారు. అలాంటి సమయంలో వారి కష్టాలు తీర్చుతూ అవసరమైన సరుకులు, ఆర్థిక సాయం అందించి నేనున్నా అంటూ భరోసా కల్పించాడు నటుడు సోనూసూద్. ఆ సమయంలో యావత్ భారత దేశం ఆయన్ని ఓ దేవుడిగా చూసింది.
ఎవరైనా కష్టం అని వస్తే.. వివరాలు తెలుసుకొని సాయం అందిస్తూనే ఉన్నాడు. తాజాగా ఏపికీ చెందిన నిరుపేద విద్యార్థిని చదువు కోసం సాయం చేస్తామని మాట ఇచ్చి మరోసారి తన మంచి మనసు చాటుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ కర్నూల్ జిల్లా బనవనూరుకు చెందిన దేవి కుమారి అనే అమ్మాయి బీఎస్సీ చదవాలనుకుంది. కానీ ఆమె ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో చదువుకు దూరం ఉండాల్సి వచ్చింది. ఈ విషయం ట్విట్టర్ వేధికగా ఓ నెటిజన్ ఆమె వివరాలు ట్విట్ చేశారు.
ట్విట్ చూసిన వెంటనే ఆ యువతి గురించి పూర్తి వివరాలు సేకరించి త్వరలో ఆర్థిక సాయం అందిస్తానని హామీ ఇచ్చాడు. అంతే కాదు ఆ యువతి ఏ కాలేజ్ కి వెళ్తావో రెండీ గా ఉండూ.. అంటూ ట్విట్ చేశారు. ఈ విషయం తెలిసిన దేవీ కుమారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.. తన మంచి చదువు చదివి సమాజానికి సేవ చేస్తానని చెప్పింది.