హీరో అక్కినేని నాగచైతన్యకు కాబోయే భార్య ఎన్ని కోట్లకు వారసురలో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

అందరు అనుకున్నట్లుగానే నాగచైతన్య, శోభితాలు తొందరలోనే పెళ్లి బంధంతో ఒక్కటవ్వనున్నారు. ఈక్రమంలో ఎంగెజ్ మెంట్ వేడుక వైభవంగాజరిగింది. అక్కినేని నాగార్జున వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేసి కోత్త జంటను ఆశీర్వదించారు. అక్కినేని ఫ్యామిలీ అభిమానులు కూడా స్పెషల్ గా విషేస్ చెప్పారు. అయితే ప్రస్తుతం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల నిశ్చితార్థం ఫోటోస్ నెట్టింట వైరలవుతుండగా.. అందులో వీరిద్దరూ సంప్రదాయ దుస్తులలో మరింత అందంగా కనిపిస్తున్నారు.

ఈ నిశ్చితార్థంలో చైతన్య, శోభిత వేసుకున్న సాంప్రదాయ దుస్తులను బాలీవుడ్ స్టార్ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల సినిమాలు, నెట్ వర్త్ గురించి ఆరా తీస్తున్నారు నెటిజన్స్. జోష్ సినిమాతో కెరీర్ ప్రారంభంచిన చైతన్య ఆస్తులు ఇప్పటివరకు రూ154 కోట్లు. అలాగే లైఫ్ స్టైల్ ఆసియా నివేదికల ప్రకారం శోభితా ధూళిపాళ నికర విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుంది.

శోభిత ధూళిపాళ ఆంధ్రప్రదేశ్‌లోని తెనాలిలో పుట్టి విశాఖపట్నంలో పెరిగింది. ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన శోభితా.. 2013లో ఫెమినా మిస్ ఇండియా ఎర్త్ టైటిల్ గెలుచుకోవడంతో పాటు మిస్ ఇండియా పోటీల్లో సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. 2016లో అనురాగ్ కశ్యప్ తెరకెక్కించిన “రమణ్ రాఘవ్ 2.0″తో సినీ రంగ ప్రవేశం చేసింది. ఇందులో ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ తర్వాత అడివి శేష్ నటించిన గూఢచారి సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది.

అలాగే మేజర్ మూవీలోనూ నటించింది. పొన్నియిన్ సెల్వన్, మేడ్ ఇన్ హెవెన్ సినిమాలు, వెబ్ సిరీస్ లలో నటించింది. శోభితా ధూళిపాళ ఒక్కో ప్రాజెక్ట్‌కు రూ. 70 లక్షల నుండి 1 కోటి వరకు వసూలు చేస్తుంది. “పొన్నియిన్ సెల్వన్: ఐ”లో తన పాత్ర కోసం ఆమె కోటి రూపాయలు అందుకున్నట్లు సమాచారం. శోభిత నటనతో పాటు బ్రాండ్ ఎండార్స్‌మెంట్‌లు, ప్రకటనల ద్వారా గణనీయంగా సంపాదిస్తుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *