పెళ్లి తర్వాత చైతన్య, శోభిత కలిసి న్యూయార్క్ టైమ్స్ కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో వీరి గురించి బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలిపారు. ఈ క్రమంలో చైతు పెళ్లి ప్రపోజల్ గురించి మాట్లాడాడు. అయితే నాగచైతన్య తెలుగు వాడైనా పుట్టి పెరిగిందంతా చెన్నైలో కావడం, చదివింది ఇంగ్లీష్ మీడియం కావడంతో ఎక్కువగా తమిళ్, ఇంగ్లీష్ వచ్చంట.
తెలుగులో మాట్లాడగలిగినా అంత పూర్తిగా, సరళంగా మాట్లాడలేడట. సినీ పరిశ్రమలో వివిధ భాషలకు చెందిన నటీనటులను కలుస్తుండటంతో తెలుగు, ఇంగ్లీష్ మిక్స్ చేసే మాట్లాడేవాడట. దీంతో తెలుగు మాట్లాడే వాళ్లకు తనకు ఇష్టమని తెలిపాడు. అలా శోభిత పరిచయం అయ్యాక తెలుగమ్మాయి కావడంతో తనతో తెలుగులోనే మాట్లాడాలని కండిషన్ పెట్టాడట.
రెగ్యులర్ గా తనతో తెలుగులోనే మాట్లాడమని శోభితను అడిగేవాడిని అని, దానివల్ల నాగచైతన్యకు తన తెలుగు ఇంకా మెరుగుపడుతుంది అని భావిస్తున్నట్టు నాగచైతన్య తెలిపాడు.