శోభిత.. తాను వంట చేసిన ఫొటోలను ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా పంచుకుంది. అయితే ఈ ఫొటోలకు శోభితా భర్త నటుడు నాగచైతన్య స్పందిస్తూ.. ఆ వంటను రుచి చూడాలని ఉందంటూ చైతూ కామెంట్ చేశాడు. కాగా ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్గా మారింది. అయితే ఆ రూమర్లకు చెక్ పెడుతూ మళ్లీ సినిమాలతో బిజీగా మారిపోయిందీ అక్కినేని కోడలు.
ప్రస్తుతం ఓ మూవీలో నటిస్తోన్న శోభిత తన రెగ్యులర్ అప్ డేట్స్ ను నిత్యం సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది. ఇటీవల తన సినిమా డబ్బింగ్ పనులను పూర్తి చేసినట్టు ఒక ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా నెటిజన్ల నుంచి సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఇదే మూవీ సెట్ నుంచి మరికొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది శోభిత. ఇందులో ఆమె వంట చేస్తున్న వీడియో కూడా ఉంది.
‘వంట చేయడం మనిషి ప్రాథమిక నైపుణ్యం‘ అంటూ ఒక క్రేజీ క్యాప్షన్ కూడా రాసుకొచ్చింది. ప్రస్తుతం శోభిత షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు నెట్టింట వైరలవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ‘అక్క మీలో కుకింగ్ టాలెంట్ కూడా ఉందా‘ అని ఒకరు కామెంట్ చేయగా శోభత స్పందిస్తూ తనకు మూడ్ ఉన్నప్పుడే చేయాలనిపిస్తుంది చెల్లి అంటూ సమాధానం ఇచ్చింది.
ఇక శోభిత షేర్ చేసిన ఈ ఫొటోలపై నాగచైతన్య కూడా స్పందించారు. ‘శోభిత చేసిన వంటలను రుచి చూడటానికి ఎదురుచూస్తున్నాను‘ అంటూ కామెంట్ పెట్టాడు. మొత్తానికి ఇప్పుడు శోభిత కుకింగ్ ఫొటోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.