పిల్లల విషయంలో శోభిత ధూళిపాళ్ల అందరికి అక్కినేని ఫ్యామిలీకి షాక్ ఇవ్వనుందా..?

divyaamedia@gmail.com
1 Min Read

చైతన్య 2017లో హీరోయిన్ సమంతను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కానీ వీరిద్దరి బంధం ఎక్కువ కాలం కొనసాగలేదు. 2021లో వీరిద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత కొంతకాలం ఒంటరిగా ఉన్న చైతూ 2022లో శోభితాతో ఏర్పడిన పరిచయం ఆ తర్వాత ప్రేమగా మారినట్లు తెలుస్తోంది. త్వరలోనే వీరిద్దరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.

చైతూ ప్రస్తుతం తండేల్ చిత్రీకరణలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే తాజా ఇంటర్వ్యూలో శోభిత తన వివాహం గురించి ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఆమె తెలుగుకు చెందిన సంప్రదాయాలను పాటించి వివాహం చేసుకోవాలని ఆకాంక్షిస్తోంది. ఎంగేజ్‌మెంట్ ఎలాగా జరగాలని అనుకుంటే, అలాగే జరిగిందని చెప్పిన శోభిత, అది ఎంత గ్రాండ్‌గానో, సింపుల్‌గానో జరిగిందనే విషయం గురించి పెద్దగా పట్టించుకోలేదని స్పష్టం చేసింది.

తన భవిష్యత్తులో తల్లి అవ్వాలనే కోరిక ఉందని కూడా శోభిత వెల్లడించింది. తాను పెళ్లిలో సంప్రదాయ తెలుపు పట్టు చీర, ఎర్ర అంచుతో కట్టుకుంటానని, పెళ్లి వేడుకలో తెలుగు సంప్రదాయాలు అత్యంత ముఖ్యమని ఆమె చెప్పింది. గతంలో ఈ జంట లండన్‌లో పెళ్లి చేసుకోనున్నారని ప్రచారం జరిగింది, కానీ దీనిపై అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *