మందు కొడుతుండగా వచ్చిన నాగు పాము, దీంతో అతడు చేసిన నిర్వాకం చూస్తే..!

divyaamedia@gmail.com
2 Min Read

పాములు చాలా భయంకరమైన జంతువులు.. సరీసృపాల్లో భయంకరమైన జీవులు ఉన్నాయి.. పాములు కాటేస్తే నిమిషాల్లోనే చనిపోయే ప్రమాదం ఉంది.. అందుకే.. సాధ్యమైనంత వరకు పాములకు దూరంగా ఉంటారు. అందుకే.. వీటికి సంబంధించిన వీడియోలను ఆసక్తికరంగా వీక్షిస్తుంటారు. అయితే మందుబాబుల చేష్టల గురించి అయితే చెప్పాల్సిన పని లేదు. వాటిని తాడులా భావించి నడుముకు కట్టుకోవడం, మెడలో వేసుకోవడం చేస్తుంటారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి పాముకు పదే పదే ముద్దులు కూడా పెడుతుంటారు.

ఇలాంటి షాకింగ్ ఘటనలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంటాయి. తాజాగా, ఇలాంటి వీడియో ఒకటి నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఓ వ్యక్తి మందు కొడుతుండగా.. ఓ నాగుపాము అటుగా వస్తుంది. పామును చేతిలోకి తీసుకున్న అతను.. చివరకు ఏం చేశాడో మీరే చూడండి.. సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వ్యక్తి పెద్ద రాయి మీద కూర్చుని మందు తాగుతుంటాడు. అయితే మధ్యలో ఉన్నట్టుండి షాకింగ్ ఘటన చోటు చేసుకుంటుంది. సదరు వ్యక్తి మందు తాగుతున్న సమయంలో ఓ నాగుపాము అటుగా వస్తుంది. మందు తాగుతుండగా మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తావా.. అని అనకుంటూ నాగుపామును చేతిలోకి తీసుకుంటాడు.

దీంతో పాము ఒక్కసారిగా పడగ ఎత్తి బుస కొడుతుంది. అయినా ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకుండా పామును దగ్గరగా తీసుకుని కళ్లలో కళ్లు పెట్టి చూస్తాడు. అయితే ఆ సమయంలో పడగ విప్పిన పాము.. అతడిపై కాటు వేయకుండా అలాగే చూస్తుండిపోతుంది. ఇంతలో ఆ వ్యక్తి పామును ధబేల్‌మని కింద పడేస్తాడు. కిందపడిన పాము అక్కడే ఆగి బుసలు కొడుతూ.. ”ఏంట్రా.. నేనంటే నీకు కొంచెం కూడా భయం లేదా”.. అన్నట్లుగా అతడి వైపే చూస్తుండిపోతుంది. పామును కిందపడేసిన ఆ వ్యక్తి ఆ తర్వాత ఏదో గొప్ప పని చేసినట్లు ఫీలవుతూ మందు తాగుతుంటాడు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *