వర్షాకాలంలో పాముల ప్రమాదం ముఖ్యంగా పెరుగుతుంది. సాధారణంగా, వర్షం పడినప్పుడు పాములు పొడి, వెచ్చని ప్రదేశాల కోసం ఇళ్ల వైపు వస్తుంటాయి. ఇలాంటి సమయాల్లో, పర్వత ప్రాంతాల ప్రజలు నేటికీ సాంప్రదాయక, సహజ పద్ధతులను ఆశ్రయిస్తారు. వాటిలో ఒకటి నల్ల నువ్వుల పొగ. అయితే మన ఇంటి చుట్టూ కొన్ని ప్రత్యేకమైన మొక్కలను పెంచితే.. అవి పాములను దూరంగా ఉంచే శక్తిని కలిగి ఉంటాయి. ఈ మొక్కల నుంచి వచ్చే సువాసన పాములకు నచ్చదు.. కాబట్టి అవి ఆ ప్రాంతానికి దగ్గరగా రావు.
పుదీనా నుంచి వచ్చే ఘాటైన వాసన పాములకు నచ్చదు. ఇంటి చుట్టూ లేదా బాల్కనీలో పుదీనా మొక్కలు పెంచితే పాములు దరిచేరవు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం కలిగించే మొక్క ఇది. వెల్లుల్లి, ఉల్లిపాయ మొక్కలు. వీటి వాసనలో ఉండే బలమైన రసాయనాలు పాములను దూరంగా ఉంచుతాయి. ఈ వాసన వల్ల పాములు ఆ ప్రదేశానికి రావడం మానేస్తాయి. ఇంటి పెరట్లో నాటడానికి వీటిని ఎంచుకుంటే మంచిది.

చామంతి పువ్వుల నుంచి వచ్చే వాసన పాములకు నచ్చదు. వీటిని ఇంటి ముందు ద్వారం దగ్గర లేదా కిటికీ దగ్గర నాటితే.. అవి ఇంట్లోకి రాకుండా అడ్డుకుంటాయి. అలాగే వీటితో ఇంటి అందం కూడా పెరుగుతుంది. లెమన్ గ్రాస్ లో సిట్రోనెల్లా అనే సహజ పదార్థం ఉంటుంది. ఇది పాములనే కాదు దోమలు, ఇతర కీటకాలనూ తరిమేస్తుంది. ఇంటి చుట్టూ ఈ మొక్కలు పెంచితే ఇంటి శుభ్రతకు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. పాములు ఇంట్లోకి రాకూడదనుకుంటే పైన చెప్పిన మొక్కల్లో కనీసం రెండు లేదా మూడు ఇంటి పరిసరాల్లో పెంచితే సరిపోతుంది.
ఇవి సహజమైన మార్గాలు కావడం వల్ల పర్యావరణానికి మేలు చేస్తాయి.. ఆరోగ్యానికి హాని కలిగించవు. మరిచిపోకండి ఇంటిని శుభ్రంగా ఉంచడం, చెత్తను వెంటనే తొలగించడం, గుంతలు మూసివేయడం కూడా ఈ సమస్య నివారణలో భాగమే. పాముల భయాన్ని తగ్గించాలంటే ఇంటిని మాత్రమే కాదు.. చుట్టూ ఉన్న ప్రదేశాన్ని కూడా క్రమం తప్పకుండా నిర్వహించాలి. పైన చెప్పిన మొక్కల వాసనతో పాములు దూరంగా ఉండటమే కాదు.. ఇంటి అందాన్ని పెంచడంలోనూ ఇవి సహాయపడతాయి. సహజంగా సురక్షితంగా ఉండే ఈ పరిష్కారాలతో మీరు కుటుంబాన్ని రక్షించుకోండి.