ఒక్క చుక్క పాము విషం శరీరంలోకి వెళ్లినా ప్రాణాలు పోయే ప్రమాదం ఉంటుంది. అలాంటిది ఒకేసారి ధారగా విషం బయటికి వస్తే ఇంకెలా ఉంటుంది. తాజాగా వైరల్ అవుతున్న పాము వీడియో చూసి అంతా అవాక్కవుతున్నారు. చెప్పును పాము కాటేయగానే విషం విడుదల చేయడం చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.
ఓ ఇంట్లోకి దూరిన పాము అక్కడ రాళ్ల మధ్యలోంచి గోడలోకి వెళ్లేందుకు ప్రయత్నిస్తుంది. ఆ పామును గమనించి ఆ యింటి యజమాని దాన్ని అక్కడినుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. రకరకాలుగా బెదిరించాడు. కానీ ఆ పాము అక్కడినుంచి కదల్లేదు. చివరికి ఓ చెప్పు తీసుకొని పాముని కదిలించాడు. అంతే పాము ఆగ్రహంతో రెచ్చిపోయింది. అతనిపై దాడి చేసింది.
చెప్పును కాటేసింది. అలా చెప్పును చాలాసేపు కాటువేస్తూ విషాన్ని విడుదల చేసింది. అదే కాటు ఆ వ్యక్తి చేతిని వేసి ఉంటే అతని పరిస్థితి ఏమయ్యుండేదో అర్ధం చేసుకోవచ్చు. నెట్టింట వైరల్ అవుతున్న ఈ వీడియోను చూసి నెటిజన్లు షాకవుతున్నారు. వీడియోపై రకరకాలుగా స్పందించారు. ఇంత విషం శరీరంలోకి వెళ్తే పరిస్థితి ఏంటో అంటూ కొందరు,
పాములకు మనం హాని చేయకుండా ఉంటే అవి మనకి ఎలాంటి హానీ చేయవు అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోను దాదాపు 4 లక్షలమంది వీక్షించారు. వేలాదిమంది లైక్ చేసి షేర్ చేస్తున్నారు.