పాము పేరు వినగానే.. మనలో చాలా మంది భయపడి పారిపోతుంటారు. మన ఇళ్ళలో చిన్న పాము కనిపించిన దాన్ని చంపే వరకు ప్రశాంతంగా ఉండలేము. అలాంటి భయంకరమైన పాములతో కొందరు సరదగా ఆడుతూ.. ప్రాణాలతో చెలగాటమాడుతుంటారు. ఇలాంటి వీడియోలు సోషల్ మీడియాలో ఎన్నో చూస్తూ ఉంటాము. అయితే తాజాగా ఓ యువకుడు పాముతో స్టంట్స్ చేశాడు. దీంతో ఆ స్నేక్ కాస్త అతడి ప్రైవేట్ పార్ట్నే టార్గెట్ చేస్తూ కరిచింది. క్షణికావేశంలో జరిగే ఘటనలు ప్రాణాలు తీస్తాయి.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతుంది. ఇండోనేషియాకు చెందిన ఓ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అంగరా షోజీని పాము కరిచిన వీడియో ప్రస్తుతం నెట్టింట్లో హల్చల్ చేస్తుంది. షోజీ పాములతో సాహసోపేతమైన వీడియోలను తరచు తన సోషల్ మీడియాలో పంచుకుంటాడు. ఇక తాజాగా ఓ వీడియోను షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈ వీడియోలో ప్రైవేట్ పార్ట్‌ను పాము కరిచినట్టు ఉన్న ఈ వీడియో అందరినీ ఎంతగానో భయపెడుతుంది. పాముల పట్ల పేరుగాంచిన అంగరా పెట్టిన ఈ వీడియో ప్రస్తుతం సంచలనం రేపుతుంది. అంగర చేసిన ఈ రిస్కి స్టంట్ అందరినీ భయబ్రాంతులకు గురిచెస్తుంది. ఆ వీడియోలో పాము తను ప్రైవేట్ భాగాన్ని కరుస్తున్నట్టు ఉంది. అయితే పాము తన భాగాన్ని గట్టిగా పట్టుకుని, లాగినా విడవకుండా ఉంది. ఆ సమయంలో అంగరా ఎంతో భాదతో విలవిలలాడాడు. ఈ వీడియోను చూసిన నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. పాముల కోరల్లో విషం ఉంటుంది.
పాములు కరిస్తే బ్రతకము. ఇలాంటి స్టంట్స్ చేయోద్దు అంటూ కామెంట్ చేస్తున్నారు. మరికొందరు ఈ పాము మడ అడవులకు చెందిన రకం కావచ్చునని చెప్పుకొస్తున్నారు. ఈ వీడియోలో పాము పసుపు, నలుపు రంగులో ఉంది. ఇక మడ పాములను స్వల్పంగా విషపూరితమైనవిగా పరిగణిస్తారు.