మంధాన, పలాష్ ముచ్చల్ పెళ్లి రద్దు..! అసలు విషయమేంటో చెప్పేసిన స్మృతి ఫ్యామిలీ.

divyaamedia@gmail.com
2 Min Read

స్మృతి తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో పలు రూమర్లు జోరుగా చక్కర్లు కొట్టాయి. స్మృతిని పలాశ్ మోసం చేశాడని.. వీరు పూర్తిగా పెళ్లిని రద్దు చేసుకున్నట్లు ప్రచారం జరిగింది. అయితే పెళ్లి వాయిదా పడిన తర్వాత ఆన్‌లైన్‌లో ఊహాగానాలు వెల్లువెత్తాయి. పలాష్, మరో మహిళకు సంబంధించినవిగా చెబుతున్న చాట్ స్క్రీన్‌షాట్‌లు బయటకు రావడంతో, మోసం చేశారనే ప్రచారం మొదలైంది.

ఇదే సమయంలో స్మృతి తన ఎంగేజ్‌మెంట్ పోస్టులను తొలగించడాన్ని చాలా మంది అభిమానులు గమనించారు. ఇది పుకార్లకు మరింత ఆజ్యం పోసింది.డిసెంబర్ 7న పెళ్లి జరుగుతుందన్న వార్తలు చాలా మంది అభిమానులకు షాకిచ్చాయి. ఈ చీటింగ్ వివాదం ఏదైనా పీఆర్ స్ట్రాటజీనా అని కొందరు అనుమానిస్తున్నారు. “నేను ఇంతకు ముందెన్నడూ ఇంత డ్రామా చేసే వ్యక్తులను చూడలేదు..

పలాష్ ముచ్చల్, స్మృతి మంధాన డిసెంబర్ 7న సాంగ్లీలో జరిగే ఒక ప్రైవేట్ వేడుకలో పెళ్లి చేసుకోబోతున్నారని పలాష్ ధృవీకరించారు. ప్రీ-వెడ్డింగ్ వేడుకలు ఇప్పటికే ప్రారంభమయ్యాయి,” అని ఒకరు సోషల్ మీడియాలో స్పందించారు. “స్మృతి లేదా ఆమె కుటుంబంలో ఎవరూ దీనిపై ఎందుకు స్పష్టత ఇవ్వడం లేదో నాకు అర్థం కావడం లేదు! రోజుకో కొత్త పుకారు వస్తోంది!” అని మరొక యూజర్ కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా, స్మృతి మంధాన సోదరుడు శ్రవణ్ ఈ పుకార్లన్నింటినీ ఖండించారు.

కొత్త తేదీ గురించి తనకు ఏమీ తెలియదని ఆయన చెప్పారు. “ఈ పుకార్ల గురించి నాకు అసలు అవగాహన లేదు. ప్రస్తుతానికి అయితే పెళ్లి వాయిదా పడింది” అని ఆయన ‘హిందుస్థాన్ టైమ్స్’ తో చెప్పారు. మానసిక ఒత్తిడి, ఇటీవలి అనారోగ్య సమస్యల నుంచి కోలుకున్న తర్వాత కుటుంబాలు తిరిగి పెళ్లి వేడుకలను ప్రారంభిస్తాయని పలాష్ తల్లి అమితా ముచ్చల్ హెచ్‌టితో చెప్పుకొచ్చారు. ఈ జోడీ త్వరలోనే పెళ్లి చేసుకుంటారని తాను నమ్ముతున్నట్లు ఆమె తెలిపారు.

ఆమె ప్రకారం, అకస్మాత్తుగా వచ్చిన మెడికల్ ఎమర్జెన్సీల కారణంగా స్మృతి, పలాష్ ఇద్దరూ బాధలో ఉన్నారు. “పలాష్ తన వధువుతో ఇంటికి రావాలని కలలు కన్నాడు. నేను ఒక ప్రత్యేక స్వాగతాన్ని కూడా ప్లాన్ చేశాను. అంతా మంచే జరుగుతుంది. పెళ్లి చాలా త్వరగా జరుగుతుంది” అని ఆమె జోడించారు. అంతకుముందు, స్మృతి తండ్రి అనారోగ్యం పాలైన తర్వాత పెళ్లిని రద్దు చేయాలనేది పలాష్ ఆలోచనే అని ఆమె వెల్లడించారు.

“పలాష్ తన ‘అంకుల్’ (స్మృతి తండ్రి) తో ఎమోషనల్‌గా చాలా దగ్గరగా ఉంటాడు. నిజానికి, పలాష్, స్మృతి కంటే వారిద్దరే ఎక్కువ చనువుగా ఉంటారు. కాబట్టి, ఆయన అనారోగ్యం పాలైనప్పుడు, స్మృతి కంటే ముందే పలాష్ నిర్ణయించుకున్నాడు, ఆయన పూర్తిగా కోలుకునే వరకు పెళ్లి జరగకూడదని” అని ఆమె తెలిపారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *