మీకెప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఛాతి మీద ఎవరో కూర్చున్నట్లు అనిపించిందా..? ఐతే మీరు ప్రమాదంలో ఉన్నట్లే..!

divyaamedia@gmail.com
2 Min Read

అర్థరాత్రి పూట గాఢ నిద్రలో ఉన్నప్పుడు లేదా తెల్లవారు జామున కొందరికి పీడకలలు వస్తుంటాయి. ఆ కలల్లో ఒక్కోసారి దెయ్యం ఏదో వచ్చి ఛాతి మీద కూర్చున్నట్లు అనిపిస్తుంది. ఆ సమయంలో ఎటూ కదలలేరు. మాటలు కూడా రావు. దీన్నే స్లీప్ పరాలసిస్ అంటారు. అయితే రాత్రిళ్లు నిద్రపోయేటప్పుడు పీడకలలు రావడం సర్వసాధారణం. ఐతే ఒక్కోసారి నిద్రలో గుండెలపై ఎవరో కూర్చుని, పీకనులుముతున్నట్లు అనిపిస్తుంది. అరుద్దామంటే మాటపెగలదు. అరుస్తున్నట్లే అనిపిస్తుంది కానీ ఆ మాట ఎవ్వరికీ వినిపించదు. ఎంత ప్రయత్నించినా కదలడానికి వీలుపడదు.

తెల్లారాక దెయ్యం గుండెలపై కూర్చుని హింసించిందని రకరకాలుగా చెప్పుకుని భయాందోళనలకు గురవుతుంటారు. మీకు కూడా ఎప్పుడైనా ఇలా జరిగిందా? నిజానికి అది దెయ్యమో.. ఇంకేదో కాదు. గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఇలా అందరికీ జరగుతుంది. దీనిని స్లీప్‌ పెరాలసిస్‌ అంటారు. అంటే నిద్ర సమయంలో కొన్ని క్షణాలపాటు శరీరమంతా పక్షవాతానికి గురవుతుందన్నమాట. ఇది అందరికీ జరుగుతుంది. ఐతే కేవలం ఒకటి, రెండు నిముషాల పాటు మాత్రమే ఉంటుంది. సాధారణంగా గాఢ నిద్రలో ఉన్నప్పుడు, తెల్లవారు జామున నిద్రలేచే సమయానికి ఇలా జరుగుతుంది. నిద్రలో ఏదైనా కల వచ్చే సమయంలోనే ఇలా స్లీప్ పెరాలిసిస్ కూడా వస్తుంటుంది.

స్లీప్ పెరాలిసిస్ వచ్చిన తర్వాత కొన్ని సెకండ్లలో మెళకువ వస్తుంది. కళ్లు తెరచి చూస్తే అంతా మామూలుగా ఉంటుంది. ఐతే తను నిద్రపోయేటప్పుడు ఏదో జరిగిందని మాత్రం తెలుస్తుంది. అది ఏమిటన్నది స్పష్టంగా తెలియదు. దీంతో దెయ్యమే తనపై కూర్చుని హింసించిందని భావిస్తారు. అసలెందుకు ఇలా జరుగుతుంది.. స్పృహలో ఉన్నప్పటికీ కదలలేని అనుభూతి చెందడాన్ని స్లీప్‌ పెరాలసిస్‌ అంటారు. ఆలా జరిగినప్పుడు కొన్ని సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకు కదలలేరు, మాట్లాడలేరు. దీంతో ఉక్కిరిబిక్కిరి అయినట్లు అనిపిస్తుంది. నిజానికి నార్కోలెప్సీ అనే నిద్ర రుగ్మతకు సంబంధించింది. నిద్రలేమి, అవిశ్రాంతంగా పనిచేయడం వల్ల నార్కోలెప్సీ వస్తుంది.

నిద్రను నియంత్రించడం వల్ల మెదడులో సమస్య తలెత్తడాన్ని నార్కోలెప్సీ అంటారు. స్లీప్ పక్షవాతం సాధారణంగా ఒకటి రెండు సార్లు మాత్రమే సంభవిస్తుంది. నిద్రలో ఇది సంభవిస్తే.. దానిని హిప్నాగోజిక్ లేదా ప్రిడార్మిటల్ స్లీప్ పెరాలసిస్‌ అంటారు. అదే మెలకువగా ఉన్న సమయంలో జరిగితే.. దానిని హిప్నోపోంపిక్ లేదా పోస్ట్‌డోర్మిటల్ స్లీప్ పెరాలసిస్‌ అంటారు. నూటికి తొంబై శాతం మందికి నిద్రలోనే ఈ సమస్య వస్తుంది. ఇలా జరగకుండా ఉండాలంటే కమ్మటి సువాసనలు వెదజల్లే 2, 3 ఎసెన్షియల్ ఆయిల్ చుక్కలను దిండుపై వేస్తే చక్కగా నిద్రపోతారు. అయినా నిద్రపట్టకపోతే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *