శివయ్య పూజలో పొరపాటున కూడా ఈ పనులు చేయొద్దు, చేస్తే ఏలినాటి శని వెంటాడుతుంది.

divyaamedia@gmail.com
3 Min Read

శాస్త్రాల ప్రకారం శివుడు ఎంత కోపంతో ఉంటాడో అంత దయగల దైవం. హిందూ మతంలో వారంలో ఒకొక్క రోజు ఒకొక్క దేవుళ్లను పూజించే పద్ధతి ఉంది. గ్రంధాల ప్రకారం. ఈ నేపథ్యంలో సోమవారం శివునికి అంకితం చేయబడింది. భోళాశంకరుడిని ప్రసన్నం చేసుకోవడానికి భక్తులు సోమవారం ఉపవాసం పాటిస్తారు. అయితే శివయ్య పూజ సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. పొరపాటున కూడా శివయ్య పూజ సమయంలో కొన్ని తప్పులు చేయవద్దు. కనుక శివ పూజ సమయంలో కొన్ని పొరపాట్లు చేయవద్దు. లేదంటే శని దోషం ఏర్పడుతుందని వేద పురాణాల పేర్కొన్నాయి. ఈ నేపధ్యంలో శివ పూజ చేసేట‌ప్పుడుఎలాంటి పొరపాట్లు చేయ‌కూడ‌దు. సృష్టి లయకారుడు శివుడికి అత్యంత ప్రీతికరమైనది భస్మం.. దీనినే విభూదిగా భక్తులు భావిస్తారు.

దీనిని నుదిటిన ధరించిన భక్తులను కాపాడుతూ ఉంటాడని పండితులు చెబుతున్నారు. కనుక విభూదిని నుదుటన మూడు గీత‌లు అడ్డంగా ధారణ చేయాలి. విభూదిని ఇలా ధరించడం వలన పాపాలు న‌శిస్తాయని నమ్మకం. శివయ్య పూజలో భస్మాన్ని ఉపయోగించాలి. కానీ పొరపాటున కూడా కుంకుమ శివయ్య పూజలో ఉపయోగించ వద్దు. లింగానికి కుంకుమ‌బొట్టు పెట్ట వద్దు. విభూది, గంధంతో మాత్రమే అలంకరణ చేయాలి. శివయ్య అభిషేకంలో జలం, చెరకు రసం, ద్రాక్ష రసం ఇలాంటివి ఉపయోగించవచ్చు. అయితే కొబ్బిరి నీళ్ళను మాత్రం శివలింగానికి అర్పించరాదు. శివాల‌యం చుట్టూ మాత్రం చేసే ప్రదక్షిణ విషయంలో కూడా కొన్ని నియమాలున్నాయి.

మిగతా ఆలయాల్లో చేసే విధంగా ప్ర‌ద‌క్షిణలు చేయ‌కూడ‌ద‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. శివాల‌యంలో కేవ‌లం చండీ ప్రదక్షిణ మాత్రమే చేయాలి. శివ‌లింగానికి అభిషేకం ఆవు పాలతో చేయాలి. ముఖ్యంగా సోమవారం శివుడికి ఆవు పాలతో అబిషేకం చేయడం అత్యంత ఫలవంతం అని నమ్మకం. అయితే కొంతమంది పేకెట్ పాలతో అభిషేకం నిర్వహిస్తారు. ఇలా చేయడం మంచిది కాదు. పాలను ఒక గ్లాస్ లోకి తీసుకుని అనంతరం అభిషేకం చేయాలి. సోమ‌వారం రోజున కైలాసం నుంచి భూమి మీదకు శివుడు వస్తాడని నమ్మకం. కనుక ఈ రోజు పూజ చేయడం.. ఇంట్లో లేదా శివాలయంలో నువ్వుల నూనెతో దీపారాధన చేయడం బెల్లం ముక్క నైవేద్యంగా పెట్టడం అత్యంత ఫలవంతం.

శివయ్యకు అభిషేకం చేసే సమయంలో రాగి పాత్రను లేదా స్టీల్ పాత్రలు ఉప‌యోగించ‌కూడ‌దు. శివ‌లింగానికి పాలతో అభిషేకం నిర్వహించిన అనంతరం.. నీటితో అభిషేకం చేయాలి.
శివయ్యకు పూజ లేదా అభిషేకం చేసే సమయంలో శ‌రీరంపై ఉన్న చెమట లేదా వెంట్రుక‌లు శివయ్యపై పొరపాటున కూడా పడవద్దు. తగిన జాగ్రత్తలు తీసుకుని పూజించాలి. ఒకవేళ ఇంటి పూజ గదిలో శివలింగం పెట్టుకుంటే నిత్యం జ‌ల‌దార ఉండేలా ఏర్పాటు చేసుకోవాలి.
తెలుపు రంగులో ఉండే పాల‌రాతి శివ‌లింగాన్ని ఇంట్లో పెట్టుకోవద్దు. ఇంట్లో ఒక శివ‌లింగం కంటే ఎక్కువ ఉండచుకోవద్దు. శివున్ని పూజించే ముందు వినాయ‌కుడిని పూజించాలి. పూజ చేసే సమయంలో ఓం న‌మః శివాయ అనే మంత్రాన్ని జ‌పించాలి.

నంది వర్ధనం పూల‌తో పూజ చేస్తే జీవితంలో సుఖ శాంతులు లభిస్తాయి. అదే విధంగా పారిజాత పూల‌తో శివుడికి పూజ చేస్తే కాల‌స‌ర్ప దోషాలు తొల‌గిపోతాయి. శివుడికి ఎరుపు రంగు పూల‌తో పూజ చేయ‌కూడదు. వెల‌గ‌పండును శివుడికి స‌మ‌ర్పిస్తే దీర్ఘాయుష్షు ల‌భిస్తుంది. సోమ‌వారం రోజున ముక్కోటి దేవ‌ల‌తో క‌లిసి లయకారుడు శివాల‌యంలో ఉంటాడ‌ని పురాణాలుపేర్కొన్నాయి. క‌నుక సోమవారం రోజున ఎవ‌రైతే శివాల‌యానికి వెళ్తారో వారికి క‌ష్టాలు లేకుండా శివుడు వ‌రం ఇస్తాడ‌ని నమ్మకం.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *