న్యూ ఇయర్ సందర్భంగా తన అభిమానులకు ఆయన గుడ్ న్యూస్ తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎక్స్ వేదికగా ఆయన ఓ వీడియోను పోస్ట్ చేశారు. చికిత్స చివరి దశకు చేరుకుందని… త్వరలోనే మీ ముందుకు వస్తానని శివరాజ్ కుమార్ తెలిపారు. క్యాన్సర్ సోకిందని తెలిసిన తర్వాత ఎవరైనా భయపడతారని… అయితే, ఆ భయం నుంచి బయటపడేందుకు తన భార్య గీత, తన అభిమానులు ఎంతో సహకరించారని చెప్పారు. తనకు అండగా నిలిచిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.
అయితే న్యూ ఇయర్ సందర్భంగా, శివన్న స్వయంగా తన అభిమానులతో ఒక వీడియోను పంచుకున్నారు. అందులో తన ఆరోగ్యం గురించి సమాచారాన్ని అందించారు. ఈ వీడియోలో ముందుగా మాట్లాడిన గీతా శివరాజ్ కుమార్.. శివరాజ్ కుమార్ ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. శివరాజ్ కుమార్ శస్త్రచికిత్స విజయవంతమైంది. దీనికి సంబంధించి అన్ని రిపోర్టులు నెగెటివ్ గా వచ్చాయి.
పాథాలజీ రిపోర్టు వచ్చే వరకు కొంత ఆందోళన ఉండేది కానీ ఇప్పుడు ఆ రిపోర్టు కూడా నెగెటివ్ రావడంతో అంతా చాలా హ్యాపీగా ఉంది. మీరు చూపిన ప్రేమ, ఆదరణను మా ప్రాణం ఉన్నంత వరకు మరువలేనని భావోద్వేగంతో అన్నారామె. ఆ తర్వాత మాట్లాడిన శివన్న అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. తాను అనారోగ్యంతో ఉన్న సమయంలో సినిమా షూటింగ్‌లో పాల్గొన్నా అన్నారు. కీమో తీసుకుంటూనే ఫైట్ సీన్‌లో పాల్గొన్నాను. ఈ క్రెడిట్ రవివర్మకే ఇవ్వాలి.
అయితే సర్జరీ రోజు సమీపిస్తున్న కొద్దీ కొంత ఆందోళన నెలకొంది. కానీ అభిమానులు, స్నేహితులు, తోటి నటీనటులు, చిన్ననాటి స్నేహితులు ఇచ్చిన సపోర్ట్ తనకు ధైర్యాన్నిచ్చింది అన్నారు శివన్న. అంతేకాదు పలువురి పేర్లను ప్రస్తావించన శివన్న.. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా అన్ని విషయాల్లో తనకు తోడుగా ఉంటోన్న సతీమణి గీత గురించి ఎమోషనల్ అయ్యారు శివన్న.
Happy news, #ShivarajKumar sir declares himself cancer-free after successful surgery 👍#Thalaivar #Rajinikanth fans wishes and welcomes #Shivanna again to #Jailer2 Squad 💥
— Rajini✰Followers (@RajiniFollowers) January 1, 2025
pic.twitter.com/owct372IKV