శివరాజ్‌ కుమార్‌ క్యాన్సర్‌ను జయించారో తెలుసా..? క్యాన్సర్‌ మహమ్మారి ఎలా గెలిచారంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

గత కొన్ని రోజుల క్రితం క్యాన్సర్‌ బారిన పడ్డ ఈ స్టార్‌ హీరో.. తాజాగా క్యాన్సర్‌ను జయించారు. ప్రస్తుతం శివరాజ్‌ కుమార్‌ క్రమంగా కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన క్యాన్సర్‌ను ఎలా జయించారన్న వివరాలను ఇతరులతో పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే క్యాన్సర్‌ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను బలితీసుకుంది. సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు దీని బారిన పడుతున్నారు. కన్నడ స్టార్‌ హీరో శివరాజ్‌ కుమార్‌ కూడా ఈ క్యాన్సర్‌ మహమ్మారి బరిన పడిన విషయం తెలిసిందే. అయితే తాజాగా ఆయన క్యాన్సర్‌ నుంచి కోలుకుంటున్నారు.

ఈ క్రమంలో ఆయన క్యాన్సర్‌ను ఎలా జయించారు? ఎంత దృఢ సంకల్పంతో ఉన్నారు? క్యాన్సర్‌ నిర్ధారణ అయిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? అనే అంశాలను వివరిస్తూ.. క్యాన్సర్‌తో ఆయన పోరాడిన తీరును ఒక డాక్యూమెంట్రీ రూపంలో తీసుకొస్తున్నారు. క్యాన్సర్‌ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌కుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? క్యాన్సర్‌ రోగుల ప‌ట్ల ఎలా వ్యవహరించాలి? వంటి అంశాల‌పై ఇప్పటికే చాలా మంది సెల‌బ్రిటీలు అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు శివ రాజ్ కుమార్ కూడా క్యాన్సర్‌కు సంబంధించి విదేశాల్లో చికిత్స తీసుకుంటూ మ‌హ‌మ్మారిపై ఆయ‌న పోరాటాన్ని తెలియ‌జేసేలా ఓ డాక్యుమెంట‌రీకి సంక‌ల్పించారు.

ఇందులో వ్యాధి ప‌ట్ల అవ‌గాహ‌న క‌ల్పించ‌డం, బాధితుల్లో ధైర్యాన్ని నింపాల‌నే ఉద్దేశంతో డాక్యుమెంట‌రీ చేస్తున్నారు. అమెరికాలో చికిత్స తీసుకున్న స‌మ‌యంలో డాక్టర్లు నాకెంతో అండ‌గా నిలిచారు. క్యాన్సర్‌పై నా పోరును డాక్యుమెంట‌రీ తీస్తే చాలా మందిలో ధైర్యాన్ని పెంచొచ్చు అని వారు భావించారు. ఈ విష‌యాన్ని నాతో చెప్పారు` అని శివ‌రాజ్ కుమార్ అన్నారు. దీంతో సోష‌ల్ మీడియా వేదిక‌గా శివన్నను ఉద్దేశించి అభిమానులు పోస్టులు పెడుతున్నారు.

క్యాన్సర్‌ను పూర్తిగా జ‌యించి, మ‌రిన్ని అవేర్ నెస్ కార్యక్రమాలు చేప‌ట్టాల‌ని కోరుతున్నారు. ఇక సామాజిక సేవ‌లో రాజ్‌కుమార్‌ ఫ్యామిలీ ముందుంటుంద‌ని చెప్పాల్సిన ప‌నిలేదు. ఇప్ప‌టికే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అనాథ పిల్లలకు, వృద్దుల‌కు, విద్యార్థుల‌కు తాము చేయాల్సింద‌ల్లా చేస్తున్నారు. ఇలాంటి విష‌యాల్లో దివంగ‌త న‌టుడు, శివరాజ్‌ కుమార్‌ సోదరుడు.. పునీత్ రాజు కుమార్ మ‌రింత దాతృహృద‌యంతో వ్యవహరించేవారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *