ప్రజలకు గుడ్ న్యూస్, భారీగా తగ్గిన వెండి ధరలు, తొందరలోనే ఇంకా..?

divyaamedia@gmail.com
1 Min Read

భారతదేశంలో పండుగ సీజన్‌లో అపూర్వమైన వెండి కొనుగోళ్లు జరిగాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్‌తో లండన్ తీవ్ర కొరతతో సతమతమవుతోందని బ్లూమ్‌బెర్గ్ న్యూస్ నివేదిక తెలిపింది. ఈ పండుగ సీజన్‌లో భారతీయ పెట్టుబడిదారులు వెండి ఆధారిత ఆభరణాలను కొనుగోలు చేయడానికి తొందరపడుతున్నారు.

దీనివల్ల భౌతిక వెండి కొరత ఏర్పడింది. అయితే వెండి ప్రియులకు ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పండగకు ముందు ముట్టుకుంటే అంటుకునేలా ఉన్న వెండి ధర ఇప్పుడు ఒక్కసారిగా పడిపోయింది. కేజీపై ఏకంగా రూ.8 వేలు తగ్గి భారత మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,64, 000 లకు చేరుకుంది.

తాజాగా తగ్గింపు తర్వాత హైదరాబాద్‌లో వెండి ధరలు చూసుకుంటే మార్కెట్‌లో ప్రస్తుతం కిలో వెండి ధర రూ. 1,82,000గా కొనసాగుతుంది. అక్టోబర్ మధ్యలో ఔన్సు వెండి ధరలు $50 దాటాయి. అయితే, గత వారం చివర్లో అంతర్జాతీయ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడంతో దీని బ్రేక్ పడింది.

అక్టోబర్ 17న అమెరికాలో వెండి ధరలు 6 శాతానికి పైగా తగ్గడం అక్టోబర్ 20న భారత మార్కెట్‌లోని ETFలపై ప్రభావం పడింది. దీంతో దేశంలో ఒక కిలో వెండి ధర దాదాపు 7 శాతం తగ్గి రూ.1,72,000 నుండి రూ.1,64,000కి చేరుకుంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *