Silk Smitha: సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్‌ను వేలం వేస్తే ఎంత పలికిందో తెలుసా..?

divyaamedia@gmail.com
2 Min Read

Silk Smitha: సిల్క్ స్మిత సగం తిన్న యాపిల్‌ను వేలం వేస్తే ఎంత పలికిందో తెలుసా..?

Silk Smitha: అప్పట్లో సిల్క్ స్మిత క్రేజ్ ఏమిటో చెప్పేందుకు ఈ సంఘటన నిదర్శనం. సిల్క్ స్మిత ఎంగిలి చేసిన ఆపిల్ ని వేలం వేశారట. దాన్ని కొనేందుకు జనాలు ఎగబడ్డారట. అయితే సిల్క్ స్మిత అసలు వడ్లపట్ల విజయలక్ష్మి. ఆంధ్రాలోని ఏలూరు ప్రాంతానికి చెందిన అమ్మాయి. 1960 డిసెంబర్ 2న దెందులూరు మండలం కొవ్వలిలో పుట్టిన పుట్టిన సిల్క్ స్మిత.. నాల్గవ తరగతి వరకే చదువుకుంది. 15 ఏళ్లకే ఆమె పెళ్లి చేసేశారు. అత్తింటి వేధింపులు భరించలేక.. ఆమె మద్రాసు పారిపోయింది. అక్కడ టచప్ ఆర్టిస్ట్‌గా కొన్నాళ్లు పనిచేసింది.

Also Read: ఇండియాలోకి మరో కొత్త వైరస్, చిన్నపిల్లలకు సోకితే అత్యంత ప్రమాదం.

తర్వాత సినిమాల్లో చిన్న, చిన్న రోల్స్ చేస్తోన్న ఆమెను.. ‘ఇనయే తేడి’ సినిమాతో మలయాళం డైరెక్టర్ ఆంథోనీ ఈస్ట్ మన్ హీరోయిన్ చేశాడు. ఆ తర్వాత ఆమె నటించిన తమిళ చిత్రం.. ‘వండిచక్రం’ మంచి హిట్ అయింది. విజయలక్ష్మి కాస్తా.. సిల్క్ స్మితగా మారిపోయింది. జయమాలిని, జ్యోతిలక్ష్మి వంటివారు సినిమా ఇండస్ట్రీని రూల్ చేస్తోన్న సమయంలో.. శృంగార రసాధిదేవతగా దూసుకొచ్చింది సిల్క్ స్మిత. ఆ తర్వాత అందరు టాప్ హీరోలతో ఆడిపాడింది. ఒకానొక సమయంలో హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ తీసుకుంది.

సిల్క్ ఉందంటే చాలు.. ఎడ్లబండి కట్టుకుని మరీ సినిమాలుకు వెళ్లేవారు యువకులు. సిల్క్‌ అందాన్ని ఆరాధించే భక్తులు పెరిగిపోయారు. అప్పట్లో ఫోన్స్ గట్రా లేవు కాబట్టి.. సినిమా తారల ఆగోగ్రాఫ్‌ల కోసం అభిమానులు ఎగబడేవారు. అందుకు విభిన్నంగా.. ఒక కిళ్ళీ తెచ్చుకొని ఆమెను కొరికి ఇమ్మని తమిళ ఫ్యాన్స్ బ్రతిమాలుకునేవారు. 1984 లో ఒక సారి షూట్ బ్రేక్‌లో సిల్క్ స్మిత యాపిల్ తింటూ ఉండగా షాట్ రెడీ అని చెప్పి ఆమెను పిలిచారట.

Also Read: లైంగిక కోరికను పెంచే ఆహార పదార్దాలు ఇవే. ఆ పని ముందు వీటిని తింటే..?

సిల్క్ సగం తిన్న యాపిల్ అక్కడే వదిలేసి వెళ్ళిపోయారట. ఆ కొరికిన యాపిల్‌ను ఆమె మేకప్ మన్ అక్కడికక్కడే వేలం వేస్తే సెట్లో ఉన్నవాళ్ళు పోటీపడి 26 వేలకు కొనుక్కున్నారట. అప్పట్లో 26 వేలు అంటే మాటలా. అది సిల్క్ స్మితకు ఉన్న డిమాండ్. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన సిల్మ్ స్కిత్ 1996 సెప్టెంబర్ 23న సిల్క్ స్మిత సూసైడ్ చేసుకున్నారు. ఆమె మరణంపై ఇప్పటికీ ఎన్నో అనుమానాలు ఉన్నాయి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *