ఇండస్ట్రీలోకి విలన్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి హీరోగా ఎదిగిన నటుడు మోహన్ బాబు. ఈయన మంచి నటుడే అయినప్పటికీ చిరంజీవి రేంజ్ లో స్టార్ హీరోగా మాత్రం గుర్తింపు తెచ్చుకోలేకపోయాడు.అయితే అయితే చిరంజీవి కెరీర్ బిగినింగ్ లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో కిరాయి రౌడీలు అనే చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో మోహన్ బాబు కూడా ఉన్నారు. రాధిక హీరోయిన్. ఒక ఫైట్ సన్నివేశాన్ని చిరంజీవి, మోహన్ బాబు మధ్య అడవిలో చిత్రీకరించారట. ఈ విషయాన్ని ప్రముఖ రచయిత కానగల జయకుమార్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.
ఈ చిత్రానికి నిర్మాత క్రాంతి కుమార్. ఆయనకి అప్పటికే చిరంజీవి అంటే చాలా ఇష్టం. ఆ ఫైట్ సీన్ లో రాధిక కూడా ఉంటుంది. రాధికకి మోహన్ బాబు రేప్ చేయడానికి ప్రయత్నించాలి. అలా చేస్తున్నప్పుడు రాధికకి దారుణ అవమానం జరిగింది. మోహన్ బాబు ఆమెని గట్టిగా పట్టుకుంటాడు. రాధిక తప్పించుకుని వెళ్ళిపోవాలి. మోహన్ బాబు గట్టిగా పట్టుకోవడంతో ఒక్కసారిగా ఆమె డ్రెస్ జారిపోయింది. దీనితో ఆమె ప్రైవేట్ పార్ట్స్ రివీల్ అయ్యే పరిస్థితి కనిపించింది. నిర్మాత క్రాంతి కుమార్ అక్కడే ఉన్నారు. ఆయన వేగంగా స్పందించి కట్ అని చెప్పారు. ఒక్కసారిగా రాధిక కింద పడిపోయింది. ఆమె డ్రెస్ జారిపోవడంతో అంతా షాక్ అయ్యారు.
ఎవరూ ఏమీ మాట్లాడకుండా తలా దిక్కూ వెళ్లిపోయారు. చిరంజీవి గారు కూడా అక్కడే ఉన్నారు. కాసేపు సెట్ మొత్తం నిశ్శబ్దం ఆవహించింది. ఆ సంఘటనతో నిర్మాత క్రాంతికుమార్ బాగా సీరియస్ అయ్యారట. కనకాల జయకుమార్ మాట్లాడుతూ.. మోహన్ బాబు నా దగ్గరకి వచ్చి.. ఏంట్రా క్రాంతి కుమారు.. వాడి పెళ్ళాం లాగా ఫీల్ అయిపోతున్నాడు అని అన్నారు. నాకేం మాట్లాడాలో అర్థం కాలేదు. సినిమా పూర్తయ్యాక మరో గొడవ జరిగింది. సినిమా టైటిల్స్ లో చిరంజీవి పేరు ముందు వేయాలా.. మోహన్ బాబు పేరు వేయాలా అనే చర్చ జరిగింది.
క్రాంతి కుమార్ కేమో చిరంజీవి అంటే ఇష్టం. కానీ మోహన్ బాబు చిరంజీవి కన్నా సీనియర్. అప్పుడే మోహన్ బాబు ఫోన్ చేసి టైటిల్స్ వేశారా అని అడిగారు. ఇంకా లేదు అండీ అని చెప్పా. నేను చిరంజీవి కన్నా సీనియర్ .. కాబట్టి నా పేరు ముందు వేయాలి అని అన్నారు. దీనిపై ఒక గంట చర్చించిన తర్వాత ఒక పరిష్కారం కనుగొన్నాం. ముందు మోహన్ బాబు పేరే వేసాం. చివర్లో చిరంజీవి పేరు వేస్తూ పెద్ద అక్షరాలతో ‘అబౌవ్ ఆల్ అవర్ చిరంజీవి’ అని వేసినట్లు జయకుమార్ తెలిపారు. అప్పటికి చిరంజీవికి సుప్రీం హీరో అని కానీ, మెగాస్టార్ అని కానీ బిరుదు రాలేదు.