శిల్పా శిరోద్కర్ 1989లో భ్రష్టాచార్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత కిషన్ కన్హయ్య, హుమ్, ఖుదా గవా, ఆంఖెన్, మృత్యుదండ సినిమాలతో పాటు చివరగా 2000వ ఏడాదిలో వచ్చిన గాజా గామిని మూవీలో నటించింది. అయితే 90లలో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి. తన సోదరి నమ్రతా శిరోద్రక్ బాటలోనే సినిమాల్లోకి అడుగుపెట్టి తనకంటూ ఓ ఇమేజ్ సంపాదించుకుంది.
1989లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఆమె.. అనేక హిట్ చిత్రాల్లో నటించింది. కెరీర్ మంచి ఫాంలో ఉండగానే 2000లో బ్యాంకర్ అపరేష్ రంజిత్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. పెళ్లి తర్వాత భర్తతోపాటు విదేశాల్లో సెటిల్ అయ్యింది. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో ఆమె మాట్లాడుతూ..
సినిమాలు వదిలేసిన తర్వాత, తాను న్యూజిలాండ్‌లో హెయిర్‌డ్రెస్సర్‌గా మారి, సెలూన్‌లో పనిచేశానని తెలిపింది. వివాహం తర్వాత, శిల్పా శిరోద్కర్ మొదట నెదర్లాండ్స్‌కు, తరువాత తన భర్తతో కలిసి న్యూజిలాండ్‌కు వెళ్లారు. అక్కడ తాను తాను హెయిర్‌డ్రెస్సింగ్ కోర్సు చేయాలని ప్లాన్ చేశానని.. ఆ తర్వాత హెయిర్‌డ్రెస్సర్‌గా ఉద్యోగంలో చేరినట్లు తెలిపింది.
ఈ ఉద్యోగం తన నటనా జీవితానికి దగ్గరగా ఉందని.. అందులో ఎన్నో మేకప్, ఇతర విషయాలు తెలుసుకున్నట్లు చెప్పారు. అలాగే రెండు నెలలపాటు సెలూన్ లో పనిచేసినట్లు తెలిపింది. శిల్పా శిరొద్కర్ సోదరి హీరోయిన్ నమ్రత సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి అన్న సంగతి తెలిసిందే.