జీవితంలో తన చివరి కోరిక ఏంటో చెప్పిన హీరో షారుఖ్ ఖాన్, షాక్ లో బాద్ షా ఫ్యాన్స్.

divyaamedia@gmail.com
2 Min Read

ఇండియాలో అత్యంత ధనవంతులైన నటులలో షారుఖ్ ఖాన్ మొదటి ప్లేస్ లో ఉన్నారు. సీరియల్ నటుడిగా కెరీర్ ను స్టార్ట్ చేసి..బాలీవుడ్ ను శాసించే స్ధియికి ఎదిగిన షారుఖ్‌ జీవితం ఎంతో మందికి ఆదర్శం. నటుడిగా ఎన్నో ఆటుపోట్లు చూశారు షారుక్ ఖాన్. కొంత కాల చాలా క్రూషియల్ స్టేజ్ ను చూశారు షారుఖ్ ఖాన్. జీరో సినిమా ప్లాప్ తరువాత బాద్ షా పని అయిపోయింది అనుకున్నారంతా. తాజాగా ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు షారుక్ ఖాన్. జీవితాంతం ఇండస్ట్రీలోనే ఉంటారా? లేక వేరే రంగంలోకి వెళ్తారా? అని యాంకర్ ప్రశ్నించగా.. దానికి షారుక్ ఖాన్ స్పందిస్తూ.. చనిపోయే వరకు నేను సినిమాల్లోనే ఉంటాను.

అంతేకాదు నేను ఏదైనా సినిమా షూటింగ్లో ఉన్నప్పుడు యాక్షన్ అని చెప్పగానే చనిపోవాలి.. మళ్లీ వాళ్ళు కట్ చెప్పినా సరే నేను లేవకూడదు. అదే నా చివరి కోరిక. ఎప్పుడు నేను దేవుడిని అదే ప్రార్థిస్తాను. సినిమా షూటింగ్లో నటిస్తున్నప్పుడే నా ప్రాణాలు తీసుకో అని నేను కోరుతాను అంటూ సరదాగా చెప్పుకొచ్చారు షారుక్ ఖాన్. దీన్ని బట్టి చూస్తే సినిమా పై ఆయనకున్న ప్యాషన్ ఏంటో ఇట్టే అర్థమవుతుంది. అయితే సినిమా షూటింగ్లో ఉన్నప్పుడే తాను చనిపోవాలి అన్న తన చివరి కోరిక విని అభిమానులు కంగారుపడుతున్నారు. తన అభిమాన హీరోకి ఇలాంటి చావు రాకూడదు అంటూ కామెంట్ చేస్తున్నారు.

ఏది ఏమైనా ఒక్కొక్కరి అభిప్రాయం ఒక్కో విధంగా ఉంటుందంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం. ఇక అలాగే స్టార్డం గురించి కూడా షారుక్ ఖాన్ మాట్లాడుతూ.. నాకొచ్చిన స్టార్ డంను నేను గౌరవిస్తాను.. కానీ దానికి పెద్దగా ప్రాధాన్యత అయితే ఇవ్వను. ముఖ్యంగా అభిమానుల ప్రేమ, ఆదరణ, గుర్తింపు, డబ్బులు వస్తాయి కదా అందుకు నా కుటుంబం కూడా సంతోషంగా ఉంటుంది. అయితే నాకు సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎక్కువే అని నేను అనుకుంటాను. నా జోకులతో ప్రేక్షకులను విపరీతంగా నవ్వించగలరు కానీ వారికి అర్థమవుతాయో లేదో నాకు తెలియదు.

దానికి కారణం ఏమిటంటే ప్రస్తుతం ఇప్పుడున్న రోజుల్లో చాలామంది ఎంతో సున్నితంగా ఉన్నారు. మనం జోక్ చేసినా సీరియస్ గా తీసుకుంటున్నారు. కొంతమంది డిస్టర్బ్ అవుతున్నారు కూడా.. కాబట్టి ఆ ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకపోతేనే బెటర్ అని తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఉన్న విధివిధానాలపై ఆయన ఆలోచించిన తీరుకి ప్రశంసలు కురిపిస్తున్నారు అభిమానులు. ఏది ఏమైనా షారుక్ ఖాన్ ప్రస్తుత ఆలోచనలు ట్రెండుకు తగ్గట్టుగా మారుతుండడం చూసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *