రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిన షన్ను, చివరికి ఏం జరిగిందంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

షన్ను..బిగ్ బాస్ కి వెళ్లి మరింత పాపులారిటీ తెచ్చుకున్నాడు. కానీ ఆ తర్వాత దీప్తి సునయనతో తన బ్రేకప్, ఓ యాక్సిడెంట్ కేసు, గంజాయి తాగాడని ఆరోపణలు, వాళ్ళ అన్నయ్యకు సంబంధించి.. ఇలా వివాదాల్లో నిలిచాడు. వాటన్నిటి తర్వాత చాలా గ్యాప్ తీసుకొని ఇటీవలే లీలా వినోదం అనే ఓటీటీ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే చాలా కాలం గ్యాప్ తీసుకున్న షన్నూ ఇప్పుడు లీలా వినోదం అనే సినిమాతో ఓటీటీ అడియన్స్ ముందుకు వచ్చాడు. ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ పామ్ ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఈ సినిమా ప్రమోషనల్లో జరిగిన ఓ ఈవెంట్లో షన్నూ మాట్లాడుతూ తన లైఫ్ లో జరిగిన సంఘటనలను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలోనూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు. తన జీవితంలో ఎదురైన సంఘటనలతో రెండుసార్లు సూసైడ్ అటెంప్ట్ చేసినట్లు చెప్పుకొచ్చాడు. షన్నూ మాట్లాడుతూ.. “బెంగళూరులో అమృత యూనివర్సిటీలో చదువుకున్నాను. కానీ అప్పటి నుంచే యాక్టింగ్ అంటే పిచ్చి. దీంతో లెఫ్ట్ బ్రెయిన్ కొంచం హెవీ అయ్యిందని..చదవలేకపోతున్నానని ఇంట్లో చెప్పాను.

దీంతో వాళ్లు నన్ను ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ డాక్టర్ తో యాక్టింగ్ అంటే ఇష్టం అని.. అందుకే ఇలా చెప్పాను అని చెప్పడంతో అతడు నాకు ప్రెజర్ ఎక్కువగా ఉందని తీసుకెళ్లాలని చెప్పాడు. అదే సమయంలో ఫస్ట్ లవ్ బ్రేకప్, యాక్టింగ్ ఛాన్సులు రాకపోవడంతో డిప్రెస్ అయి సూసైడ్ అటెంప్ట్ చేశాను” అని అన్నాడు. “నేను ఏం చేసానో.. మీరు ఏం విన్నారో అదేం నిజం కాదు. అయ్యింది ఒక కథ అయితే మీకు మరో కథ చూపించారు. నేను తప్పు చేయలేదు అని చెప్పట్లేదు. కానీ నేను ఒక్కడినే తప్పు చేశాను అన్నట్లుగా చూపించారు.

ఒకదాని తర్వాత ఒకటి రావడంతో.. నా చుట్టూ ఉన్నవాళ్లే నన్ను వదిలేయడంతో నేను డిప్రెషన్ లోకి వెళ్లాను. అప్పుడు చెయి కోసుకోని సూసైడ్ అటెంప్ట్ చేశాను. నా ఫ్యామిలీ చాలా ఎఫెక్ట్ అయ్యారు. నేను హనుమాన్ మీద ఒట్టేశాను. నా ఫ్యామిలీని పైకి తీసుకోచ్చేది నేనే” అంటూ మరోసారి ఎమోషనల్ అయ్యాడు షన్ను.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *