ఇటీవల వీరేంద్ర సహ్వాగ్, ఆర్తి మధ్య కారులో జరిగిన గొడవను చూపిస్తున్న ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ వీడియోలో వీరేంద్ర సహ్వాగ్, ఆర్తి కారులో కలిసి ఉండగా వారు ఒకరితో ఒకరు గొడవపడుతూ కనిపించారు. ఈ వీడియో ఆధారంగా వీరిద్దరి మధ్య బంధంలో గొడవలు ఉన్నాయని అనేక రకాల వార్తలు వస్తున్నాయి. అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో, వీరేంద్ర సెహ్వాగ్, అతని భార్య ఆర్తి కారులో కూర్చుని కనిపిస్తున్నారు.
ఈ సమయంలో, ఇద్దరూ ఒకరితో ఒకరు గొడవ పడుతుండటం చూడొచ్చు. ఇద్దరూ చాలా కోపంగా కనిపిస్తున్నారు. తీవ్రంగా వాదులుకున్నారు. ఈ వైరల్ వీడియో ఆధారంగా నిరంతరం వివిధ రకాల వాదనలు వస్తున్నాయి. ఈ గొడవ వల్లే ఈ జోడీ బంధం చెడిపోయిందని కొంతమంది అభిమానులు భావిస్తున్నారు. కానీ, ఈ వీడియో AI అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సృష్టించచారని, దీనిని సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారని అంటున్నారు.
సెహ్వాగ్, ఆర్తి చాలా కాలంగా బహిరంగంగా కలిసి కనిపించడం లేదు. ఇద్దరూ సోషల్ మీడియాలో ఒకరినొకరు అన్‌ఫాలో చేసుకున్నారు. ఆ తర్వాత వారి సంబంధం విచ్ఛిన్నమైందని వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా, సెహ్వాగ్, ఆర్తి గ్రే విడాకులు తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. సరళంగా చెప్పాలంటే, భార్యాభర్తలు 40 నుంచి 50 లేదా అంతకంటే ఎక్కువ వయస్సులో విడిపోవాలని నిర్ణయించుకుంటే, దానిని గ్రే విడాకులు అంటారు.
గ్రే విడాకుల విషయానికి వస్తే, కోర్టు ఇద్దరి ఆస్తి, భరణం, పదవీ విరమణ ప్రయోజనాలు మొదలైన వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటుంది.