ఆమె ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటుతున్న కుర్ర హీరోయిన్లలో ఒకరు. స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ కూతురిగా సినీరంగంలోకి అడుగుపెట్టిన సారా.. మొదటి సినిమాతోనే నటిగా మంచి మార్కులు కొట్టేసింది. అయితే చేసింది తక్కువ సినిమాలే కానీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. ఫిట్ నెస్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ఈ అమ్మడు గతంలో తాను ఏకంగా 96 కేజీల వరుకు బరువు ఉండేదాన్ని అని తెలిపింది.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ హాట్ బ్యూటీ సారా అలీఖాన్. బాలీవుడ్ లో ఇప్పుడు ఈ ముద్దుగుమ్మ ఓ క్రేజీ హీరోయిన్. ఈ యంగ్ బ్యూటీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంటుంది. అందంతో పాటు నటనతోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటుంది ఈ చిన్నది. ప్రస్తుతం బాలీవుడ్ లోనే సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీ ఇప్పుడు సౌత్ లోనూ సినిమాలు చేయాలని ట్రై చేస్తుంది.
కాగా గతంలో ఓ ఇంటర్వ్యూలో సారా అలీఖాన్ మాట్లాడుతూ.. సినిమాల్లోకి రాకముందు నేను దాదాపు 96 కిలోల బరువు ఉండేదని అని తెలిపింది. అదే ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచి తనకు పీసీఓడీ (PCOD) సమస్య ఉండేదని, దాని వల్ల విపరీతంగా బరువు పెరిగాను అని తెలిపింది. సినిమాల్లోకి రావడానికి ముందు ఆమె ఒకటిన్నర సంవత్సరాలు కష్టపడి బరువు తగ్గించుకున్నా అని తెలిపింది. ఇప్పుడు ఈ భామ సన్నజాజి నడుముతో తన వయ్యారాలతో కుర్రకారును కట్టిపడేస్తుంది.