బర్ఖా మదన్, సోఫియా హయత్, గ్రేసీ సింగ్.. లాంటి ఎందరో అందాల తారలు ఇప్పుడు సాధ్విలుగా మారి సింపుల్ లైఫ్ ను లీడ్ చేస్తున్నారు. ఈ అందాల తార కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతుంది. ఒకప్పుడు వెండితెర, బుల్లితెరపై స్టార్ నటిగా రాణించిన ఆమె ఇప్పుడు సన్యాసినిగా మారిపోయారు. దేవాలయాల వద్ద ఆమె భిక్షాటన కనిపిస్తున్నారు. ఆమెకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తరచూ వైరల్ అవుతున్నాయి.
ఇంతకీ ఆ అందాల తార మరెవరో కాదు నూపూర్ అలంకార్. అయితే బాలీవుడ్ లో వెండితెర, బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది ప్రముఖ నటి నూపూర్ అలంకార్. అప్పట్లో టెలివిజన్ రంగంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన శక్తిమాన్ సీరియల్ లో కీలక పాత్ర పోషించారు నుపూర్. ఆ తర్వాత పలు సినిమాలు, సీరియల్స్ లో నటించి మంచి నటిగా గుర్తింపు సంపాదించారు.

నూపూర్ అలంకార్ సెలబ్రెటీ హూదా వదిలిపెట్టి అందరూ ఆశ్చర్యపోయే విధంగా సంచలన నిర్ణయం తీసుకున్నారు.. ఇటీవల ఆమె సన్యాసినిగా మారారు. ఉత్తర్ ప్రదేశ్ లో పూర్తిగా కాషాయ దుస్తులు ధరించిన ఆమె గోవర్ధన్‌లోని దంఘటి దేవాలయం వద్ద భిక్షాటన చేస్తూ కనిపించింది. గత కొంత కాలంగా తన ఫ్యామిలీ లైఫ్ లో ఇబ్బందులు పడ్డానని.. ఆ సమయంలో తన గురువు సూచనతో సన్యాసం తీసుకున్నట్లు నుపూర్ తెలిపారు.
తాను బిక్షాటన చేస్తే కొంత డబ్బు వస్తుందని.. ప్రస్తుతం జీవితాం ఇలా గడిచిపోతుందని అంటున్నారు. కాగా, నూపూర్ అలంకార్ బిక్షాటన చేస్తున్న దృశ్యాలకు సంబంధించిన వీడియో, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.