సందీప్ కిషన్.. ‘స్నేహగీతం, ప్రస్థానం’ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడైన యువ కథానాయకుడు సందీప్‌కిషన్ బాలీవుడ్‌లోనూ తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో సందీప్ కిషన్ ఒకరు. సందీప్ కిషన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చివరిగా మజాకా సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఈ సినిమా యావరేజ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో సందీప్ కిషన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. ఎన్నో సూపర్ పాత్రలతో ప్రేక్షకులను మెప్పించాడు ఈ యంగ్ హీరో.. సినిమాల రిజల్ట్స్ ఎలా ఉన్నప్పటికీ తన నటనతో ప్రేక్షకులకు దగ్గరయ్యాడు సందీప్. మజాకా ప్రమోషన్స్ సమయంలో ఓ ఇంటర్వ్యూలో సందీప్ మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు.
తాను ఓ వ్యాధితో బాధపడుతున్నా అని తెలిపాడు. తాను సైనస్ తో బాధపడుతున్నట్టు తెలిపాడు. సినిమా షూటింగ్ లో గ్యాప్ లో కార్ వ్యాన్ లోకి వెళ్లి నిద్రపోతాను అని చెప్పాడు. పడుకున్న తర్వాత నా ముక్కునుంచి తన వెనక భాగం వరకు బ్లాక్ అవుతుందని తెలిపాడు. అలాగే ఉదయాన్నే లేవగానే నేను ఎవరితోనూ మాట్లాడను. మా అమ్మానాన్నతో కూడా నేను మాట్లాడనూ..
ఉదయాన్నే వేడిగా టీ తాగి, మెడిటేషన్ మ్యూజిక్, స్తోత్రాలు విని ఆతర్వాత మాట్లాడతా అని చెప్పాడు. అలాగే దీని కోసం సర్జరీ చేయించుకోవాలి.. ఆపరేషన్ చేయించుకుంటే ముక్కు మారిపోతుందని, ముఖం మారిపోతుందని భయమేసి చేయించుకోవడం లేదు అని సందీప్ తెలిపాడు. అలాగే నెలరోజుల పాటు షూటింగ్ గ్యాప్ తీసుకోవాలి, ఊపిరి పీల్చుకోవడానికి చాలా కష్టపడాలి. అందుకే నాకు భయం అని సందీప్ చెప్పుకొచ్చాడు.