రెండో పెళ్లి తర్వాత సమంత మతం మారిందా..? అసలు విషయం ఏంటంటే..?

divyaamedia@gmail.com
2 Min Read

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, రాజ్ నిడిమోర్ రెండో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సమంత ఏమాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమైంది, తర్వాత నాగచైతన్యతో ప్రేమలో పడి వివాహం చేసుకుంది. ఇక మనస్పర్థల కారణంగా వీరిద్దరు పరస్పర అంగీకారంతో విడిపోయి, వారి వారి కెరీర్ పై ఫోకస్ పెట్టిన విషయం తెలిసిందే. అయితే సంప్రదాయ పద్ధతిలో ‘భూత శుద్ధి వివాహ’..

అందరూ ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నట్లే, నటి సమంత రూత్ ప్రభు తన స్నేహితుడు, ఫిల్మ్‌మేకర్ రాజ్ నిడిమోరు ను పెళ్లి చేసుకుంది. 2025 డిసెంబర్ 1న కోయంబత్తూరులోని ఈషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి జరిగింది. ఇది స్టార్ హీరోయిన్ పెళ్లి అయినా సరే, ఎలాంటి హడావుడి కనిపించలేదు. కేవలం ఓ ముప్పై మంది చాలా దగ్గరి వాళ్ళు, కుటుంబ సభ్యుల మధ్యే చాలా సింపుల్‌గా ముగిసింది. ఈ పెళ్లిలో వీళ్లిద్దరూ ‘భూత శుద్ధి వివాహ’ అనే ప్రత్యేకమైన హిందూ సంప్రదాయాన్ని ఫాలో అవ్వడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ట్రెడిషనల్ రెడ్ కలర్ శారీలో సమంత కనిపించింది. అగ్ని సాక్షిగా ఇద్దరూ ఒక్కటయ్యారు. పెద్ద పెద్ద విందులకు బదులుగా, చాలా పద్ధతిగా సాత్విక భోజనంతోనే ఈ వేడుకను పూర్తి చేశారు. ఆధ్యాత్మికత వైపు సమంత అడుగులు.. వాస్తవానికి సమంత క్రిస్టియన్ కుటుంబంలో పుట్టింది. అందుకే నటుడు నాగ చైతన్యతో 2017లో జరిగిన ఆమె మొదటి వివాహంలో హిందూ, క్రిస్టియన్ రెండు సంప్రదాయాలనూ గౌరవించి వేడుకలు జరిపారు.

అయితే 2021లో విడాకులు, ఆ తర్వాత మయోసైటిస్ లాంటి తీవ్ర ఆరోగ్య సమస్యలతో పోరాడటం ఆమె ఆలోచనా విధానంలో పెద్ద మార్పునే తీసుకొచ్చింది. గత కొన్నేళ్లుగా సమంత పూర్తిగా ఆధ్యాత్మికత వైపు మళ్లినట్లు మనకు స్పష్టంగా తెలుస్తోంది. తరచుగా హిందూ దేవాలయాలు సందర్శించడం, ఈషా ఫౌండేషన్ దైవమైన ‘లింగ భైరవి’ అమ్మవారి విగ్రహాన్ని తన పూజ గదిలో ఉంచుకోవడం సోషల్ మీడియాలో మనం చూస్తూనే ఉన్నాం.

సద్గురు బోధనలు, యోగా సాధన తన కష్టకాలంలో ఎంతో ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చాయని సమంత చాలా సందర్భాల్లో చెప్పింది. దీనిపై అందరూ అడుగుతున్న ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పాలంటే, తాను మతం మారినట్లు సమంత ఎక్కడా అధికారిక ప్రకటన చేయలేదు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *