సమంత చెప్పేవన్నీ అబద్ధాలే.. నకిలీ మందులతో ఎందుకింత మోసం? సమంతపై మళ్లీ విరుచుకుపడిన డాక్టర్.

divyaamedia@gmail.com
2 Min Read

హీరోయిన్ సమంత.. ఏవైనా ఉత్పత్తులు మంచివి కావనిపిస్తే సదరు యాడ్స్ చేయడం లేదని చెప్పింది. అలా గతేడాది 15 వాణిజ్య ప్రకటలను రిజెక్ట్ చేసినట్లు ఇటీవలే వెల్లడించింది. ఏదైనా యాడ్ చేయడానికి ముందు ఆ ప్రోడక్ట్ను తన దగ్గరున్న ముగ్గురు డాక్టర్లు పరిశీలిస్తారని.. వారి నిర్ణయాన్ని బట్టే ముందుకు వెళ్తున్నట్లు తెలిపింది. అయితే ఈ క్రమంలోనే పలు మెడిసిన్స్ గురించి కూడా ఇన్ స్టా గ్రామ్ లో పోస్టుల పెడుతోంది. ఈ క్రమంలో సామ్ ఇటీవల షేర్ చేసిన ఒక పోస్ట్‌ వివాదాస్పదమైంది.

అందులో ఆమె ఎన్‌ఎమ్‌ఎన్‌ (నికోటినమైడ్‌ మోనోన్యూక్లియోటైడ్‌) అనే సప్లిమెంట్‌ బ్రాండ్ ను ప్రమోట్‌ చేసింది. ఇది శరీరంలో ఎన్ ఏ డీ (నికోటినామైడ్ అడెనిన్ డైన్యూక్లియోటైడ్) స్థాయిలను పెంచుతుందని, దీనివల్ల శక్తి పెరుగుతుందని, త్వరగా కోలుకుంటారని, ఏకాగ్రత పెరుగుతుందని సామ్ పేర్కొంది. ‘నేను కేవలం వీటిని తీసుకోవడమే కాదు గటాకా సంస్థ కోఫౌండర్‌గానూ మారాను. ఎందుకంటే నేను ఈ సప్లిమెంట్లను పూర్తిగా నమ్ముతున్నాను. ఇది షార్ట్‌కట్స్‌ కోసం కాదు మీ భవిష్యత్తు కోసం’ అని సామ్ రాసుకొచ్చింది.

అయితే ఈ పోస్టును చూసిన ద లివర్‌ డాక్టర్‌.. సమంతపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. వృద్ధాప్యాన్ని తగ్గించే ఔషధం అంటూ నకిలీ మందులను ప్రమోట్‌ చేస్తోందంటూ హీరోయిన్ పై విమర్శలు గుప్పించాడు. ‘సమంత సైన్స్ తెలియని నటి. ఆమె ప్రమోట్ చేస్తున్న కంపెనీ ఒక మోసపూరితమైనది. నాడ్ అనేది జీవక్రియకు ఒక ముఖ్యమైన కో ఎంజైమ్ . అయితే NMN అనేది నాడ్ స్థాయిలను పెంచుతుందని, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని ప్రచారంలో ఉన్న ఒక సప్లిమెంట్. చాలామంది.. దీనిని వాడితే వృద్ధాప్యాన్ని తగ్గించే అద్భుతమైన ఔషధం అంటూ మార్కెటింగ్ చేస్తున్నారు.

దీనికి శాస్త్రీయ ఆధారాలు కూడా ఏవి లేవు. దీనివల్ల శరీరం శోషణకు గురవుతుందే తప్ప అవయవాలకు చేరుతుందని ఎటువంటి ఆధారాలు లేవు. ఎలుకలపై నెలలపాటు ప్రయోగాలు జరిపినప్పుడు అవి వయసు పెరుగుతున్నప్పటికీ కాస్తంత చురుకుగా ఉన్నట్లు తేలింది. అంతేకానీ వాటి జీవితకాలం పెరిగిందనో.. లేదా వృద్ధాప్యంలో వచ్చే వ్యాధులు దూరమయ్యాయనో నిరూపితం కాలేదు. పైగా ఈ మందులు శరీరంలోని కీలకమైన కణాల వరకు చేరి వాటిని రిపేర్‌ చేసినట్లు ఎక్కడా రుజువు కాలేదు.

పని చేయని మందులు వాడమంటూ లక్షలాది అభిమానులను ఈ సైన్సు తెలియని సెలబ్రిటీలు ఎందుకు మోసం చేస్తున్నారు? ‘మీకు నిజంగా వయసు కనిపించకుండా మరింత యవ్వనంగా కనిపించాలనుంటే ఆహారశైలి, వ్యాయామం, నిద్రపై ఫోకస్‌ పెట్టండి. సిగరెట్‌, మద్యపానం వంటివాటికి దూరంగా ఉండండి. పాములాంటి ప్రచారకర్తలు చెప్పే మాటల్ని నమ్మవద్దు. నిజమైన సైన్సును, సాక్ష్యాలను మాత్రమే నమ్మండి. అసలైన వైద్యులు చెప్పేదే వినండి’ అని రాసుకొచ్చాడు డాక్టర్. లివర్‌ డాక్టర్‌ సమంతపై విమర్శలు కురిపించడం ఇదేమీ మొదటి సారి కాదు. గతంలోనూ ఆయన నటిపై ఇలాగే తీవ్ర విమర్శలు చేశాడు. మరి వీటిపై సామ్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *