Samantha: నాగచైతన్య రెండో పెళ్ళితో సమంతకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన అక్కినేని ఫ్యామిలీ.

divyaamedia@gmail.com
2 Min Read

Samantha: నాగచైతన్య రెండో పెళ్ళితో సమంతకు భారీ గుడ్‌న్యూస్ చెప్పిన అక్కినేని ఫ్యామిలీ.

Samantha: నాగ చైతన్య , శోభిత ధూళిపాళ గురువారం సైలెంట్‌గా నిశ్చితార్థం చేసుకున్నారు. వీరి నిశ్చితార్థానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. నాగ చైతన్య రెండో పెళ్లికి సిద్ధమవడంతో సమంత అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఏమాయ చేశావే చిత్రంలో అక్కినేని హీరోతో ప్రేమలో పడ్డ విషయం తెలిసిందే. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్నప్పటికీ వీరి బంధం మూన్నాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది. సామ్ – నాగచైతన్య విడాకులు తీసుకుని ఎవరి లైఫ్ వారు లీడ్ చేస్తున్నారు.

Also Read: నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షాకింగ్ పోస్ట్.

ఈ క్రమంలో నాగ చైతన్య సమంతతో పాటు తెలుగు ప్రజలందరికీ భారీ షాక్ ఇచ్చాడు. హీరోయిన్ శోభితా ధూళిపాళ్లతో నిశ్చితార్థం చేసుకుని ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు. ముందుగా ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికన ఫొటోలు షేర్ చేసి వెల్లడించారు. తర్వాత నాగ చైతన్య తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీగా పెట్టుకున్నారు. ప్రస్తుతం కూడా చై-శోభితా ఎంగేజ్‌మెంట్ పిక్స్ నెట్టింట ట్రెండింగ్ లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. నాగచైతన్య -శోభితా వివాహం చేసుకుంటే సమంతకు చాలా మంచి జరుగుతుందంటూ ఫ్యాన్స్ భావిస్తున్నారు.

Samantha-pic

ఓ రకంగా చెప్పాలంటే చై వేరే పెళ్లి చేసుకుంటాని ప్రకటించడం ప్రస్తుతం సామ్‌కు అక్కినేని ఫ్యామిలీ గుడ్‌న్యూసే అందించింది. అసలు సామ్ బాధపడాల్సిన అవసరమే లేదంటున్నారు. ఎందుకంటే చైతన్యతో పెళ్లికి ముందు సమంతతో నటించడానికి పెద్ద హీరోలు ముందుకొచ్చేవారు. పెళ్లికి ముందు సామ్ బ్లాక్ బస్టర్ సినిమాలతో దూసుకుపోయింది. వివాహనంతరం సమంత అక్కినేని ఇంటి కోడలు కావడంతో రొమాంటిక్ నటించేందుకు కాస్త ఇబ్బంది పడేదని, అంతేకాకుండా దర్శక, నిర్మాతలు కూడా నాగార్జున కోడలు కావడంతో అలాంటి సినిమాల్లో నటించేందుకు అడగకపోవడం లాంటివి జరిగాయట.

Also Read: నాగచైతన్య- శోభిత జంట మధ్య ఏజ్‌ గ్యాప్ ఎంతో తెలుసా..?

కాగా ఇప్పుడు చై పెళ్లైపోతుంది. సామ్ కెరీర్ మొదట్లో ఎలా వరుస బ్లాక్ బస్టర్ సినిమాలతో దుమ్మురేపిందో అలాగే నటించొచ్చని, సామ్ ను ఆపేవారు లేరని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపై ఎలాంటి సన్నివేశాల్లోనైనా నటించొచ్చు,ఏ హీరోతోనైన కలిసి వర్క్ చేయవచ్చని, గతంలోలాగ సామ్ హ్యాపీగా లైఫ్ లీడ్ చేయబోతుందని అంటున్నారు. కాగా చైతన్య పెళ్లే అక్కినేని ఫ్యామిలీ సమంతకు అందించిన భారీ గుడ్‌న్యూస్ అంటూ నెటిజన్లు సమంతకు సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు.

TAGGED:
Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *