సమంతకు బిగ్ షాక్. తండ్రి కాబోతున్న నాగ చైతన్య..?

divyaamedia@gmail.com
2 Min Read

అక్కినేని నాగచైతన్య నిజంగానే తండ్రి కాబోతున్నారా.. నాగచైతన్య శోభిత దూళిపాళ్ల తల్లిదండ్రులు కాబోతున్నారంటే అక్కినేని ఫ్యామిలీ తో పాటు అభిమానుల్లో కూడా చెప్పలేనంత ఆనందం ఉంటుంది. ఎందుకంటే అక్కినేని ఫ్యామిలీ లో ఇప్పటి వరకు చిన్న పిల్లలు లేరు కాబట్టి పిల్లలు పుడితే అందరిలో ఏదో తెలియని హ్యాపీనెస్ అయితే ఉంటుంది. అయితే సమంత, నాగ చైతన్య 2021లో విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత ఒంటరిగా ఉన్న చైతూ గతేడాది రెండో పెళ్లి చేసుకున్నారు.

మరో నటి శోభితని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. గతేడాది డిసెంబర్‌లో మ్యారేజ్‌ జరిగింది. ఇటీవలే ఫస్ట్ యానివర్సరి చేసుకున్నారు. ఇటీవల గుడికి వెళ్లిన ఫోటోలను పంచుకున్నారు చైతూ శోభితా. తమ ఆనందాన్ని పంచుకున్నారు. శోభిత అటు హిందీ, ఇటు తెలుగు, మరోవైపు తమిళ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకుంది. ఇటీవల మణిరత్నం రూపొందించిన పొన్నియిన్‌ సెల్వన్లో నటించిన విషయం తెలిసిందే. ఇది ఆమెకి మంచి గుర్తింపుని తెచ్చింది.

అయితే చాలా కాలంగా నాగచైతన్య, శోభిత ప్రేమ లో పడ్డారు. పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సంతోషంగా జీవిస్తున్న వీరికి సంబంధించిన ఓ వార్త ఆసక్తికరంగా మారింది. శోభిత గర్భవతి అయ్యిందనే వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలో చైతూ తండ్రి కాబోతున్నాడట. ఈ విషయాన్ని త్వరలోనే ప్రకటించబోతున్నారట. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న సమంత, రాజ్ నిడిమోరు ఇటీవల పెళ్లి చేసుకున్నారు. సమంత రెండో పెళ్లి చేసుకోవడం నాగ చైతన్యకి పెద్ద షాక్ అని చెప్పొచ్చు.

రాజ్ నిడిమోరుకు కూడా ఇది రెండో పెళ్లే. ఈ వార్త అభిమానులకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఈ నేపథ్యంలోనే సమంతకు షాక్‌ ఇచ్చేలా నాగ చైతన్య గుడ్ న్యూస్ చెప్పబోతున్నాడని అంటున్నారు. శోభితా ధూళిపాళ గర్భవతిగా ఉందని సమాచారం. త్వరలో తాను తండ్రి కాబోతున్న సంతోషకరమైన వార్తను నాగ చైతన్య సోషల్ మీడియా ద్వారా ప్రకటించి సమంతకు షాక్ ఇవ్వనున్నాడని చెబుతున్నారు. మరి ఇందులో నిజమెంతా అనేది తెలియాల్సి ఉంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *