చిత్ర పరిశ్రమలో లైంగిక వేధింపులపై జస్టిస్ హేమ కమిటీ నివేదిక సంచలనం కలిగిస్తోంది. ఈ నివేదిక తర్వాత మిగిలిన సినిమా ఇండస్ట్రీలు కూడా ఉలిక్కిపడ్డాయి. ముఖ్యంగా టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గతంలోనే టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ పై అనేక ఆరోపణలు వచ్చాయి. అయితే తాజాగా ఓ హీరోయిన్ కూడా క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని తెలిపింది. స్టార్ హీరోయిన్ క్రేజ్ ఉన్న ఈ బ్యూటీ కూడా తాను క్యాస్టింగ్ కౌచ్ బారిన పడ్డాను అని చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు.
ఓ ప్రొడ్యూసర్ తానను లైంగికంగా వేధించాడని తెలిపింది. ఇంతకూ ఆమె ఎవరో మరెవరో కాదు.. చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత హీరోయిన్ గా మారిన సనమ్ శెట్టి. అంబులి సినిమాతో సినీరంగంలోకి అడుగు పెట్టింది ఈ చిన్నది. ఆతర్వాత తమిళ్ లో వరుసగా సినిమాలు చేసింది. అలాగే మహేష్ బాబు శ్రీమంతుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది ఈ చిన్నది. శ్రీమంతుడు తర్వాత సంపూర్ణేష్ బాబు నటించిన సింగం 123, ప్రేమికుడు సినిమాల్లో నటించింది.
తమిళ్, కన్నడ భాషల్లో ఎక్కువగా సినిమాల్లో నటించింది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో తన అందాలతో మతిపోగొడుతోంది. తాజాగా తాను ఇండస్ట్రీలో ఎదుర్కున్న లైంగిక వేధింపుల గురించి మాట్లాడింది. తాజాగా సనమ్ శెట్టి తమిళ సినీ పరిశ్రమపై చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. అవకాశాల ఇస్తాం.. మాతో బెడ్ షేర్ చేసుకోవాలని కొంతమంది నిర్మాతలు తనను ఇబ్బందిపెట్టారని తెలిపాడు. కోలీవుడ్ లో లింగ వివక్షత విపరీతంగా ఉంటుంది.
రెమ్యునరేషన్స్ విషయంలో చాలా తేడా ఉంటుంది. ఫోన్ చేసి సినిమా ఆఫర్ ఇస్తాం రండి అని పిలిచి తమతో గడపాలని అప్పుడే ఛాన్స్ ఇస్తామన్నట్టు మాట్లాడతారని సనమ్ శెట్టి తెలిపింది. ఈ కామెంట్స్ ఇప్పుడు కోలీవుడ్ లో వైరల్ గా మారాయి.