తన అందం, నటన, కష్టపడి పనిచేసే ధోరణితో స్టార్ హీరోయిన్లలో అగ్రస్థానంలో నిలిచిన ఈ బ్యూటీ ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎంత సక్సెస్ సాధించిందో, పర్సనల్ లైఫ్‌లో మాత్రం అంతగా అదృష్టం కలసిరాలేదు. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత సమంత ప్రస్తుతం ఒంటరిగా జీవిస్తోంది. అయితే గతంలో ఎన్నో సందర్భాల్లో జంటగానే కనిపించారు సామ్- రాజ్.
ఇటీవల కలిసే దీపావళి వేడుకలను సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే తమ ప్రేమ బంధంపై అటు సామ్ కానీ, ఇటు రాజ్ కానీ నోరు విప్పడం లేదు. ఇదిలా ఉంటే ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సమంత తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ కు సంబంధించి పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది.

అలాగే విడాకులు, మయోసైటిస్ సమస్యలపైనా స్పందించింది. ‘కెరీర్ పరంగా నేను చాలా ఒడిదొడికులను ఎదుర్కొన్నాను. నేను కష్టాల్లో ఉన్న సమయంలో కొందరు నా పరిస్థితి చూసి సంబరాలు చేసుకున్నారు. నవ్వుకున్నారు. నాకు మాయోసైటిస్ వ్యాధి వచినప్పుడు నన్ను ఎగతాళి చేసిన వాళ్లు కూడా ఉన్నారు.
అలాగే నా విడాకుల సమయంలోనూ వాళ్లు సంబరాలు చేసుకున్నారు. అవన్నీ చూసినప్పుడు మనసుకు చాలా బాధేసింది. కానీ మెల్లమెల్లగా వాటిని పట్టించుకోవడం మానేసాను’ అంటూ ఎమోషనలైంది సామ్. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి సామ్ ను అంతగా ద్వేషించే వారు ఎవరబ్బా? అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
