విడాకుల విషయంలో సమంత విమర్శలకు గురయ్యారు. సమంత ప్రవర్తనే విడాకులకు దారి తీసిందని ఆమెపై ఆరోపణలు చేశారు. ఎఫైర్స్ అంటగట్టడంతో పాటు సమంతకు పిల్లల్ని కనడం ఇష్టం లేదంటూ పుకార్లు తెరపైకి వచ్చాయి. అయితే ప్రస్తుతం నాగ చైతన్య అయితే తెలుగు హీరోయిన్ శోభిత దూళిపాళను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్దపడినప్పటికీ సమంత మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకునేలా కనిపించట్లేదు.
ప్రస్తుతం టాలీవుడ్ సినిమాల్లో నటించని ఈ బ్యూటీ హాలీవుడ్ లో నటిస్తోంది. గ్లామర్ డాల్ గా మారిపోయి అందంగా కనిపిస్తోంది కానీ అప్పుడు ఉన్న క్యూట్ నెస్.. స్మైల్ ఏవి కనిపించడం లేదు. సమంత ప్రస్తుతం హనీ బన్నీ వెబ్ సిరీస్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు.
ఒక ఇంటర్వ్యూలో ఈమె మయోసైటిసిస్ వ్యాధి గురించి ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. సమంత మాట్లాడుతూ.. ఈ వ్యాధి కారణంగా ఒక్కసారిగా అంత మర్చిపోయాను.. మతిమరుపు వచ్చినట్టయి చాలా ఇబ్బందులు పడ్డాను అని చెప్పారు. ఇక ఆమె అంత ఇబ్బంది పడిన ఆమెను ఎవరు ఆసుపత్రికి తీసుకెళ్లలేదని, హెల్త్ గురించి ఎవరు అడగలేదని ఆమె ఎప్పుడు అనుకుంటూ బాధపడుతూ ఉంటారని సామ్ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.
ఈ విషయం తెలుసుకున్న సమంత ఫ్యాన్స్.. బీ స్ట్రాంగ్ సామ్ అంటూ ఆమెకు సపోర్ట్ చేస్తున్నారు.. కాగా సమంత ఎప్పటికప్పుడు హాట్ హాట్ వార్తలతో సోషల్ మీడియాలో రచ్చ చేస్తూనే ఉంటారు.