చైతూ రెండో పెళ్లికి రెడీ అయ్యారు. శోభిత ధూళిపాళతో త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతున్నాడు. ఇక ప్రస్తుతం సమంత మళ్లీ నటనలో బిజీ అయ్యారు. ఆమె నటించిన వెబ్ సిరీస్ ‘సిటాడెల్: హనీ బన్నీ’ త్వరలోనే విడుదల కానుంది. దాంతో ఆమె వరుసగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. తాజాగా సమంత ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెండో పెళ్లిపై కామెంట్స్ చేశారు. అయితే సమంత – నాగచైతన్య ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే.
అయితే అలా వివాహం జరిగిన తర్వాత వీరిద్దరూ కలిసి హైదరాబాదులో ఒక ఫ్లాట్ ను కొనుగోలు చేశారు. అంతేకాదు ఆ ఫ్లాట్ లోనే.. కొంతకాలం ఉన్నారు కూడా.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సఖ్యత లేకపోవడం వల్ల విడాకులు తీసుకోవడంతో ఎవరికి వారు వేరే.ఇంటికి షిఫ్ట్ అయ్యారు. ప్రస్తుతం ఆ ఫ్లాట్ అక్కడ ఖాళీగానే ఉంది. సమంత కూడా ఆ ఫ్లాట్లో ఉండడం లేదు.

సమంత, నాగచైతన్య ఇద్దరు కలిసి కొనుగోలు చేశారు కాబట్టి.. ఇప్పుడు నాగచైతన్య సమంత కు విడాకులు ఇచ్చిన తర్వాత శోభితను వివాహం చేసుకోబోతున్న నేపథ్యంలో ఆమెకు గిఫ్ట్ గా ఇవ్వాలని అనుకుంటున్నారట. అంతేకాదు శోభిత పేరుపైన ఈ ఫ్లాట్ ను రాసి ఇవ్వాలని నాగచైతన్య అనుకుంటున్నట్లు వార్తలు రాగా.. ఈ ఫ్లాట్ కొనుగోలు చేసినప్పుడు తానే ఈ ఫ్లాట్ కోసం ఎక్కువ ఖర్చు చేశానన్న ఆధారాలతో సహా కోర్టులో సమర్పించి నాగచైతన్యకు నోటీసులు పంపబోతోంది సమంత అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అటు నాగచైతన్య కి కాకుండా ఇటు సమంతకి కాకుండా శోభిత మధ్యలోకి రావడంతో నెటిజన్స్ సైతం చై
తూ పై ఫైర్ అవుతున్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి కొనుగోలు చేసినప్పుడు ఇంకొకరి అభిప్రాయాలు తీసుకోకుండా ఎలా ఈమె పేరుపైన రాయాలనుకుంటున్నారు అంటూ కామెంట్లు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ఇప్పుడు ఈ వార్తలు సోషల్ మీడియాలో ఒక్కసారిగా భగ్గుమన్నాయి.