నాగచైతన్య, శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత సమంత షాకింగ్ పోస్ట్. హార్ట్‌ బ్రేక్‌ అయ్యింది అంటూ..?

divyaamedia@gmail.com
1 Min Read

ప్రేయసి, నటి శోభిత ధూళి పాళతో చైతూ నిశ్చితార్థం గురువారం జరిగింది. ఈ లవ్ బర్డ్స్ ఎంగేజ్ మెంట్ చేసుకుంటున్నారన్న వార్త నెట్టింట్లో హల్ చల్ చేసిన సంగతి విదితమే. ఈ రూమర్స్ నిజం చేశారు ఈ జంట. చైతూ-శోభిత ఎంగేజ్ మెంట్స్ పిక్స్ షేర్ చేస్తూ అఫీషియల్ ఎనౌన్స్ చేశాడు అక్కినేని నాగార్జున. అయితే సమంత ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది.

సినిమా, పర్సనల్ విషయాలు ఇలా అనేక విషయాలపై సోషల్ మీడియా ద్వారా ఫీడ్ బ్యాక్ ఇస్తుంటుంది. ఆగస్ట్ 8న, ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో బ్రోకెన్ హార్ట్ ఎమోజీని పోస్ట్ చేసింది. అలాగని ఇది నాగ చైతన్య నిశ్చితార్థానికి సంబంధించినది కాదు. భారత క్రీడాభిమానులకు ఆగస్టు 8 బోరింగ్ డేగా మారింది. చివరి క్షణంలో పారిస్ ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకం సాధించే అవకాశాన్ని కోల్పోయిన వినేష్ ఫోగట్.. రెజ్లింగ్‌కు వీడ్కోలు పలికింది.

ఆగస్టు 8 రిటైర్మెంట్ ప్రకటించింది. ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్న సమంత బ్రోకెన్ హార్ట్ ఎమోజీని షేర్ చేసింది. సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య చాలా ఏళ్లుగా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే నాలుగేళ్ల తర్వాత వారి వైవాహిక జీవితంలో విభేదాలు వచ్చాయి. వారిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించడంతో అభిమానులు షాక్ అయ్యారు.

విడాకులకు గల కారణం ఇంకా వెల్లడి కాలేదు. విడాకులు తీసుకున్న తర్వాత సమంత కెరీర్‌లో కొత్త ఊపు వచ్చింది. ఆఫర్లు పెరిగాయి. బాలీవుడ్ లోనూ సినిమాలు సిరీస్ లు చేస్తోంది సామ్. తన మాజీ భర్తను మరిచిపోయి విడాకులు తీసుకున్న సమంత ముందుకు సాగుతోంది. కాబట్టి నాగచైతన్య, శోభిత నిశ్చితార్థంపై సమంత ఎలాంటి వ్యాఖ్యలు చేయదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *