నాగచైతన్యతో విడాకుల తరువాత సినిమాలకు ఏడాది గ్యాప్ ఇచ్చింది సమంత. ఈ క్రమంలో ఆమె ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ లో నటించినప్పుడు.. ఆసిరీస్ దర్శకులలో ఒకరైన రాజ్ నిడిమోరుతో స్నేహం మొదలయ్యింది. అది కాస్తా ప్రేమగా మారినట్టు సమాచారం. అయితే సమంత పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు ఈ కొత్త దంపతులకు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా సమంత, రాజ్ లకు సంబంధించిన అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే ఈ వివాహ వేడుకకు హాజరయ్యారు. అందులో సమంత క్లోజ్ ఫ్రెండ్ శిల్పా రెడ్డి కూడా ఉంది. తాజాగా ఆమె సోషల్ మీడియాలో సమంత పెళ్లికి సంబంధించి కొన్ని పోస్టులు పెట్టింది.
ఇదే సందర్భంగా పెళ్లికి వచ్చిన అతిథులకు సమంత దంపతులు ఎలాంటి గిఫ్ట్స్ ఇచ్చారన్న విషయాన్ని కూడాశిల్పా రెడ్డి ఓ వీడియో పోస్ట్ రూపంలో పంచుకుంది. తమ పెళ్లికి హాజరైన అతిథులకు ఓ గిఫ్ట్ ప్యాక్ అందించారు సమంత, రాజ్ నిడిమోరు దంపతులు. ఇందులో ఈషా పూల నుండి తయారు చేసిన అగరబత్తులు, సద్గురువు సందేశం, భారతదేశంలో తయారైన చాక్లెట్ బార్స్, సమంత ఎంచుకున్న సీక్రెట్ ఆల్కెమిస్ట్ బ్రాండ్ పెర్ఫ్యూమ్ బాటిల్స్ ఉన్నాయి.
దీంతో పాటు శిల్పా వీడియోలో సమంత పెళ్లి తంతును మొత్తం పంచుకుంది. ఉదయం 6.00 గంటలకు వేడుక ప్రారంభమైనప్పటి నుండి రోజంతా ఎలా గడిచిందో వివరిస్తూ ఈ వీడియోలో తెలిపింది. ప్రస్తుతం సమంత పెళ్లికి సంబంధించి శిల్పా రెడ్డి షేర్ చేసిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో బాగా వైరలవుతున్నాయి.
