టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకుడు-నిర్మాత రాజ్ నిడిమోరుల వివాహం సినీ పరిశ్రమలో ఒక ఆసక్తికరమైన చర్చకు తెరలేపింది. అయితే ఈ నేపథ్యంలో సమంత రెండో పెళ్లిపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. గతంలో కూడా సమంత-నాగచైతన్య పెళ్లి, విడాకులపై వేణు స్వామి చేసిన కామెంట్స్ పెద్ద దుమారమే రేపిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు సమంత రెండో పెళ్లి తర్వాత ఆయన వ్యాఖ్యలు మళ్ళీ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఓ వీడియోలో వేణు స్వామి మాట్లాడుతూ.. సమంత రెండో పెళ్లిపై తనకు విపరీతమైన ఫోన్స్ వస్తున్నాయని, ఆమె జీవితం ఎలా ఉండబోతోంది? అని అడుగుతున్నారని చెప్పిన ఆయన.. తాను ఎవరిమీద కామెంట్స్ చేయాలని అనుకోవడం లేదని, ఎవరి వ్యక్తిగత జీవితం గురించి పట్టించుకోకుండా నా పని నేను చేసుకుంటూ వెళ్తా అని అన్నారు.

ఈ వీడియో పబ్లిక్‌లోకి రావడంతో నెటిజన్ల కామెంట్స్ హోరెత్తుతున్నాయి. కొంతమంది వేణు స్వామి జ్యోతిష్యాన్ని సపోర్ట్ చేస్తూ ఈ జ్యోతిష్యుడి గత అంచనాలు నిజమయ్యాయంటూ సమర్దిస్తుండగా.. మరికొందరు మాత్రం అది సమంత వ్యక్తిగత విషయం అని, ఇలాంటి జ్యోతిష్యాలు పనికిరావని అంటున్నారు. కాగా.. ఎలాంటి హడావిడి, పబ్లిసిటీ లేకుండా.. కేవలం క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ మధ్య సమంత- రాజ్ పెళ్లి వేడుక జరిగింది.
లింగ భైరవి దేవి ఆలయంలో ‘భూత శుద్ధి వివాహ’ అనే పద్ధతిలో వీరు పెళ్లి చేసుకోవడం విశేషం. పర్సనల్ లైఫ్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచే ఈ జంట, పెళ్లిని కూడా అంతే సింపుల్‌గా కానిచ్చేసింది. వీరిద్దరికీ ఇది రెండో పెళ్లి కావడం విశేషం.
