ఎప్పటినుంచో వీరిద్దరి పెళ్లిపై రూమర్స్ వస్తున్నప్పటికీ సడెన్ గా చడీ చప్పుడు లేకుండా పెళ్లి తంతు ముగించేశారు సమంత- రాజ్ నిడిమోరు. ఊహించని ట్విస్ట్‌తో అందరి దృష్టి ఇప్పుడు వీళ్ల పెళ్లి పైనే పడింది. అయితే వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలలో, రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులతో కలిసి దిగిన ఒక ప్రత్యేక ఫ్యామిలీ ఫోటో ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రాన్ని రాజ్ నిడిమోరు సోదరి శీతల్ నిడిమోరు స్వయంగా తన సోషల్ మీడియా అకౌంట్‌లో పంచుకున్నారు. ఈ ఫోటోలో రాజ్ కుటుంబ సభ్యులందరూ సంప్రదాయ దుస్తుల్లో, నూతన వధూవరులను ఆశీర్వదిస్తున్న తీరు కనిపిస్తోంది. సమంత ఇప్పుడు అధికారికంగా నిడిమోరు కుటుంబంలో ఒక సభ్యురాలిగా చేరినట్లు ఈ ఫోటో దృశ్యంగా తెలియజేస్తుంది. ఈ ఫోటో ద్వారా, పెళ్లికి సంబంధించిన ఇతర అంతర్గత వివరాలు, కుటుంబ సభ్యుల సందడి వెలుగులోకి

ఈ ఫోటోలో రాజ్ నిడిమోరు పక్కన నిల్చుకున్న అమ్మాయి ఎవరో తెలుసా?.. ఆమె మరోవరో కాదు ఆయన అక్కనే. ఆమె పేరు శీతల్ నిడిమోరు. స్వయంగా ఆమెనే ఈ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోలో రాజ్ నిడిమోరు అక్కతో పాటు వాళ్ల అమ్మ, నాన్న.. ముగ్గురు మేనల్లుళ్లు ఉన్నారు. రాజ్ నిడిమోరు కుటుంబం సినిమా పరిశ్రమకు సంబంధించినది కానప్పటికీ, కళలు, సాహిత్యం పట్ల మంచి అభిరుచి కలిగి ఉంటుంది.
శీతల్ నిడిమోరు పోస్ట్ చేసిన ఈ ఫ్యామిలీ ఫోటో, రాజ్ కుటుంబం సమంతను ఎంత ఆప్యాయంగా స్వాగతించిందో స్పష్టం చేస్తుంది. వివాహంపై బయట ఎన్ని వివాదాలు, విమర్శలు ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులందరూ కొత్త జంటకు మద్దతుగా నిలవడం ఈ ఫోటోలో స్పష్టంగా కనిపిస్తుంది.రాజ్, సమంత మధ్య ఉన్న అనుబంధం కేవలం ‘ఫ్యామిలీ మ్యాన్ 2’ సెట్స్‌లో మొదలైన వృత్తిపరమైన పరిచయం కాకుండా, లోతైన వ్యక్తిగత, ఆధ్యాత్మిక సాన్నిహిత్యం అని ఈ పరిణామాలన్నీ రుజువు చేస్తున్నాయి.
