ఆ రోజే ఆ వ్యక్తితో సమంత రెండో పెళ్లి, కొత్త ప్రియుడితో..?

divyaamedia@gmail.com
2 Min Read

ప్రముఖ బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో ఎక్కువగా కనిపించడం.. విదేశాలకు వెళ్లడంతో ఈ రూమర్స్ మరింత వైరల్ గా మారుతున్నాయి. ఇటీవలే ఒక దుబాయ్ కి ఫ్యాషన్ షో చూసేందుకు వెళ్లిన సమంత తన సోషల్ మీడియాలో ఒక వ్యక్తి చేయి పట్టుకొని మరి వీడియోలను షేర్ చేసింది. అయితే ఇటీవలి కాలంలో సమంత- రాజ్‌కి సంబంధించిన కొన్ని పర్సనల్ ఫొటోస్ కూడా లీక్ కావడంతో సమంత రెండో పెళ్లి మ్యాటర్ హాట్ టాపిక్ అయింది.

మరోవైపు సమంత ఎక్కడికి వెళ్లినా రాజ్ వెంటే కనిపిస్తున్నారు. సమంత భుజంపై చేయి వేసి ఎంతో ఆప్యాయంగా నవ్వుకుంటూ రాజ్ వెళ్తున్న ఫోటో దుమారమే రేపింది. దీంతో సమంత రెండో పెళ్లి కన్ఫర్మ్ అని అంతా ఫిక్సయ్యారు. సమంత, రాజ్ నిడిమోరు మూడు ముళ్ల బంధంలో ఒక్కటి కాబోతున్నట్లు తెలుస్తోంది. వీళ్ల పెళ్లి ఆగస్ట్ నెలలో ఉంటుందని ప్రచారం జరిగినప్పటికీ, సమంత మాత్రం అక్టోబర్ నెలలో పెళ్లి చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు టాక్ బయటకొచ్చింది.

అక్టోబర్ 6న పెళ్లి చేసుకోవాలనే ఆలోచనలో ఉందట సమంత. చైతూ బిగ్ షాక్ ఇవ్వాలని సమంత ఇలా ప్లాన్ చేసినట్లు వార్తలు ఊపందుకున్నాయి. సమంత- నాగ చైతన్య పెళ్లి కూడా అక్టోబర్ 6నే జరిగింది. అందుకే సమంత ఈ డేట్ ఫిక్స్ చేసుకుందని, ఎలాంటి హంగామా లేకుండా సాదాసీదాగా చర్చిలో రాజ్- సమంత ఒక్కటి కానున్నారని సమాచారం. తాజాగా దీనిపై క్లియర్ హింట్ ఇచ్చింది సమంత. డేటింగ్ వార్తలను బలపరిచేలా.. ప్రియుడి చేతిలో చేయి వేసి కనిపించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇది చూసి సమంత తన రెండో పెళ్లి విషయాన్ని కన్ఫర్మ్ చేసిందని జనం చెప్పుకుంటున్నారు. మరోవైపు తన కెరీర్ విషయమై ఎంతో జాగ్రత్తగా అడుగులేస్తోంది సమంత. ఇకపై తాను చాలెంజింగ్ రోల్స్ మాత్రమే చేస్తానని అంటోంది సమంత. సినిమాల ఎంపికలో ఎన్నో రకాలుగా అలోచించి నిర్ణయం తీసుకుంటానని, తొందరపాటు ఉండదని చెప్పింది సామ్. గతంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలోనే అక్కినేని వారింటికి కోడలిగా వెళ్ళింది సమంత.

నాగ చైతన్యను పెళ్లాడిన ఈ ముద్దుగుమ్మ.. నాలుగేళ్ల పాటు వైవాహిక బంధాన్ని కొనసాగించి ఆ తర్వాత బ్రేకప్ చెప్పడం, ఆ వెంటనే మాయోసైటిస్ అనే వ్యాధి బారినపడి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం చూసే ఉన్నాం. ఈ పరిస్థితుల్లో సమంత రెండో పెళ్లి మ్యాటర్ జనాల్లో హాట్ టాపిక్ అయింది. రీసెంట్ గానే శుభం అనే సినిమాతో నిర్మాతగా కూడా మారింది సమంత. కొత్త బ్యానర్ స్థాపించి ఈ సినిమా రూపొందించింది. తొలి సినిమానే అయినా ఆమెకు శుభం భారీ సక్సెస్ తెచ్చిపెట్టింది. మరోవైపు పలు వెబ్ సిరీసులు కూడా చేస్తూ బిజీ బిజీగా ఉంది సమంత. రాబోయే రోజుల్లో దర్శకత్వం వైపు కూడా అడుగులు వేయనుందని తెలుస్తోంది.

Share This Article
Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *