పెళ్లి తర్వాత రాజ్ నిడిమోరు కుటుంబ సభ్యులందరితో అంటే అత్తారింట్లో వాళ్లందరితో సమంత దిగిన ఒక ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఇందులో సామ్ సంప్రదాయ చీరకట్టులో మెరిసిపోతోంది. అయితే ఈ ఫొటోను షేర్ చేస్తూ రాజ్ సోదరి శీతల్ రాసిన నోట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

తన సోదరుడు పెళ్లిని చూసి ఆమె తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. అయితే కేవలం అత్యంత సన్నిహితులు, స్నేహితులు మాత్రమే సమంత- రాజ్ ల వివాహ వేడుకకు హాజరయ్యారు. కాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి.

సమంత పెళ్లికి హాజరైన స్నేహితులు ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తున్నారు. తాజాగా సమంత ఫ్రెండ్ ఒకరు ఈ పెళ్లివేడుకలోని క్యాండిడ్ ఫొటోలను పంచుకుంది. సమంతను పెళ్లి కూతురుని చేయడం నుంచి రాజ్ నిడిమోరు తాళి కట్టేవరకు ఉన్నాయి.

అలాగే చేతులకు మెహందీతో పెట్టుకుని ఎంతో సంతోషంగా నవ్వుతున్న సమంత ఫొటోలు కూడా నెటిజన్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ దర్శకుల్లో ఒకరైన రాజ్ నిడిమోరుతో చాలా కాలంగా ప్రేమలో ఉంది సామ్. ఇప్పుడు వీరిద్దరూ తమ ప్రేమ బంధాన్ని పెళ్లి బంధంగా మార్చుకున్నారు.
