టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత పేరు గత కొద్ది రోజులుగా ఆమె వ్యక్తిగత జీవితం, కొత్త నిర్ణయాల కారణంగా నిరంతరం వార్తల్లో నిలుస్తోంది. ఇటీవల ఆమె ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సిరీస్ దర్శకుడు రాజ్ నిడిమోరును వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాహం తర్వాత, సమంత తన పేరు విషయంలో ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకున్నట్లు సినీ వర్గాల్లో ఒక కొత్త చర్చ మొదలైంది. అయితే కోయంబత్తూర్‌లోని ఇషా ఫౌండేషన్‌లో సమంత, రాజ్ నిడిమోరు అత్యంత సింపుల్‌గా పెళ్లి చేసుకున్నారు.
ఎలాంటి మీడియా హంగామా లేకుండా, కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో, కేవలం 30 మంది అతిథులతో మధ్య ఈ పెళ్లి వేడుక జరిగింది. ఈ పెళ్లికి సంబంధించి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సమంత ఫోటోలలో ఆమె ధరించిన ఉంగరం హైలైట్ అవుతోంది. పెళ్లిలో సమంత ఎర్రటి పట్టు చీరలో అందంగా కనిపించింది. అందమైన అలంకరణతో మరింత అందంగా కనిపించింది.

ఇదిలా ఉంటే పెళ్లి తర్వాత తన భార్య సమంతకు ఓ ఖరీదైన గిఫ్ట్ ఇచ్చారట రాజ్. దీన్ని చూసి సమంత కూడా ఆశ్చర్యపోయిందట. తన ప్రేమకు గుర్తుగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లో ఓ అందమైన, సౌకర్యవంతమైన ఇల్లు కొని భార్య సమంతకు పెళ్లి గిఫ్ట్‌గా ఇచ్చాడట డైరెక్టర్ రాజ్ నిడిమోరు. పెళ్లి కాగానే ఆ ఇంటి తాళాన్ని సమంత చేతికి ఇవ్వడంతో ఆమె తెగ సంబరపడిపోయిందట. రాజ్ నిడిమోరు గతంలో రైటర్, హీలర్ అయిన శ్యామలీ డేను 2015లో వివాహం చేసుకోగా.. 2022లో వారు విడిపోయినట్లు సమాచారం.
అటు సమంత కూడా గతంలో నాగచైతన్యను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ‘ది ఫ్యామిలీ మ్యాన్ 2’, ‘సిటాడెల్: హనీ బన్నీ’ వంటి భారీ ప్రాజెక్టుల్లో సమంత, రాజ్ కలిసి పనిచేశారు. 2025 స్టార్టింగ్‌లో వీరి బంధం గురించి బయట ప్రపంచానికి తెలిసింది.
