చాలా రోజులుగా ఆమె తన రూమర్ బాయ్ ఫ్రెండ్, దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి తిరుగూ కనిపించింది. ఇద్దరూ చాలా క్లోజ్‌గా మూవ్ అవుతున్నట్టు కనిపించారు. ఏకంగా తన సోషల్ మీడియా అకౌంట్లలో ఫోటోలను పంచుకుంది. ఇప్పుడు మరోసారి ఆయనతో ఉన్న ఫోటోలను పంచుకుంటూ రూమర్లకి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. సమంత అమెరికా వెళ్లారు.
అక్కడ తెలుగు ప్రజలు నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమెతో పాటు అమెరికా వెళ్ళిన బృందంలో రాజ్ నిడిమోరు కూడా ఉన్నారు. డెట్రాయిట్ సిటీలో తాను దిగిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేశారు. వాటిని చాలా నిశితంగా పరిశీలిస్తే… ఒక ఫోటోలో డెట్రాయిట్ వీధుల్లో రాజ్ నిడిమోరు చేతిలో చెయ్యి వేసుకుని సమంత కనిపించారు.

మరొక ఫోటోలో… రెస్టారెంట్‌లో ఇద్దరూ పక పక్కన కూర్చుని ఉన్నారు. ఈ జంట డేటింగ్ గురించి మరొకసారి డిస్కషన్ జరగడానికి ఆ ఫోటోలు కారణం అయ్యాయి. సమంత, రాజ్ నిడిమోరు కలిసి జంటగా కనిపించడం ఇదేమి కొత్త కాదు. గత కొన్ని నెలలుగా జరుగుతున్న వ్యవహారం. రాజ్ భార్య సోషల్ మీడియాలో చేసే పోస్టుల్లో సమంతను నేరుగా ఏమీ అనరు.
కానీ ఆవిడ పోస్ట్ చేసే కోట్స్ చూస్తే సమంత మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు ఉంటాయి. సమంత సైతం సోషల్ మీడియాలో రాజ్ నిడిమోరుతో కలిసి దిగిన ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూనే ఉన్నారు.