బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్‌పై ముంబైలోని బాంద్రాలో ఉన్న అతని నివాసంలోనే దాడి జరిగింది. ఇంట్లో చోరీకి వచ్చిన దుండగుడు ఆ సమయంలో సైఫ్ మేల్కొని దొంగను పట్టుకునే ప్రయత్నం చేశాడు. అయితే దొంగ కత్తితో దాడిచేసి సైఫ్‌ను తీవ్రంగా గాయపర్చాడు. ఈ దాడిలో సైఫ్ మెడ, వెన్నెముకతోపాటు శరీరంపై ఆరుచోట్ల గాయాలయ్యాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో సైఫ్ అలీఖాన్ పై దాడి కేసులో ట్విస్ట్ చోటు చేసుకుంది.
హీరోపై దాడి చేసిన ప్రధాన నిందితుడిని ముంబై పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేసారు. అతడి పేరు విజయ్ దాస్ అని సమాచారం. నిన్న అర్దరాత్రి థానేలోని కసర్వద్వాలి ప్రాంతంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ప్రధాన నిందితుడిని ఖర్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నారు. బాంద్రా పోలీసులు, ముంబై క్రైమ్ బ్రాంచ్, థానే పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఈ ఆపరేషన్‌లో నిందితుడిని అరెస్ట్ చేశారు.
![](https://darsilivetv.com/wp-content/uploads/2025/01/arest77985-1024x576.jpg)
ఈ కేసులో ప్రధాన నిందితుడిని థానేలోని హీరానందానీ ఎస్టేట్‌లోని టిసిఎస్ కాల్ సెంటర్ వెనుక మెట్రో నిర్మాణ స్థలం సమీపంలో ఉన్న లేబర్ క్యాంప్ వద్ద అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ దాస్ మొదట్లో థానేలోని హీరానందని ప్రాంతంలో పనిచేసేవాడు. కాబట్టి అతడికి ఈ ప్రాంతంపై పూర్తిగా అవగాహన ఉంది. సైఫ్ దాడి చేసిన అనంతరం థానేలోని లేబర్ క్యాపు సమీపంలోని అడవిలో విజయ్ దాస్ దాక్కున్నట్లు సమాచారం.
అంతకు ముందు అతడు ముంబైలోని ఓ పబ్‌లో పనిచేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు విజయ్‌ని అరెస్ట్ చేసిన పోలీసులు ఇవాళ రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపరచనున్నారు. ముంబై పోలీసు అధికారులు ఈ రోజు ఉదయం 9 గంటలకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి, ఈ విషయంపై అప్డేట్ ఇవ్వనున్నారు.