సైఫ్ అలీ ఖాన్‌పై దాడి చేయడానికి ఉపయోగించిన కత్తి మూడవ భాగాన్ని పోలీసులు కనుగొన్నారు. బాంద్రాలోని నటుడు సైఫ్ నివాసానికి ఒక కిలోమీటరు దూరంలో ఉన్న సదస్సులో నుంచి కత్తి మూడో ముక్కను స్వాధీనం చేసుకున్నారు. లీలావతి ఆసుపత్రిలో చికిత్స సమయంలో సైఫ్ శరీరం నుండి 2.5 అంగుళాల పరిమాణంలో ఒక కత్తి ముక్కను స్వాధీనం చేసుకున్నారు. అయితే దాడి అనంతరం సైఫ్ అలీఖాన్ తీవ్ర గాయాలతో ముంబైలోని లీలావతి హాస్పిటల్లో చేరాడు.
ఈనెల 16న సైఫ్ అలీఖాన్ ఇంటికి దొంగతనానికి వెళ్లిన దుండగుడు.. ఒకటి, రెండు కాదు.. ఏకంగా ఆరుసార్లు కత్తితో పొడిచాడు. రెండు చోట్ల మాత్రం కత్లి పోట్ల చాలా డీప్‌గా గుచ్చుకున్నాయని డాక్టర్లు వెల్లడించారు. కాగా, గురువారం తెల్లవారుజామున 2:30 టైమ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.ఆరు రోజుల పాటు చికిత్స తీసుకున్న సైఫ్ మంగళవారం డిశ్చార్జ్ అయ్యాడు. వారం రోజుల పాటు పూర్తి బెడ్ రెస్ట్ తీసుకోవాలని సైఫ్‌కు డాక్టర్లు సూచించినట్లు సమాచారం.
ఇక సైఫ్ అలీఖాన్ని లీలావతి ఆస్పత్రికి తీసుకెళ్లిన ఆటోడ్రైవర్ భజన్‌సింగ్ రాణా.. నేడు అందరి దృష్టిలో హీరో అయిపోయాడు. ఆయన చేసిన హెల్ప్‌కు అందరు షబ్బాష్ అంటూ పొగుడుతున్నారు. కాగా, తాజాగా సైఫ్.. ఆ ఆటో డ్రైవర్‌ను ఇంటికి పిలిపించుకొని కృతజ్ఞతలు తెలియజేశాడు. సైఫ్, భజన్ సింగ్‌తో కలిసి దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. కాగా, తనను ఆటోలో తీసుకెళ్లి సరైన సమయానికి హాస్పిటల్లో చేర్చిన భజన్ సింగ్‌కు సైఫ్ ఆర్థిక సహాయం కూడా చేసినట్లు తెలుస్తుంది.
బాలీవుడ్ టాక్ ప్రకారం.. భజన్ సింగ్‌కు రూ.50 వేలు ఇచ్చినట్లు తెలుస్తుంది.ఇక మరోవైపు.. ఫైజాన్ అన్సారీ రిక్షా పుల్లర్లో భజన్ సింగ్ రాణాను సత్కరించి, ఆయనకి రూ.11,000 బహుమతిని అందించాడు.