సైఫ్ నివాసంలో ఉద్యోగం చేస్తున్న 56 ఏళ్ల నర్సు ఇలియామా ఫిలిప్ ఈ ఘటన గురించి వివరించింది. సుమారు 30 ఏళ్ళు ఉన్న ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చాడని. సైఫ్ అలీ ఖాన్ 4 ఏళ్ల కుమారుడు జెహ్ నిద్రిస్తున్న బెడ్‌రూమ్‌లోకి అతను ప్రవేశించాడని తెలిపింది. అతను కత్తితో ఆమెను బెదిరించాడని తెలిపింది. కోటి రూపాయిల డిమాండ్ చేశాడు. అయితే బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ పై దుండగులు దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనతో బాలీవుడ్ మొత్తం ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
సైఫ్ అలీఖాన్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. కత్తితో 6 సార్లు పొడిచాడు ఓ దుండగుడు. కాగా ఈ దాడిలో రెండు కత్తి పోట్లు చాలా లోతుగా దిగాయి అని వైద్యులు తెలిపారు.. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడి చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇప్పుడు నిందితుడి ఫొటో కూడా లభ్యమైంది. సీసీటీవీ ఫుటేజీలో నిందితుడి ఫొటోను పోలీసులు షేర్ చేశారు. సైఫ్ అలీఖాన్‌పై దాడి జరగడంతో ముంబయి క్రైం బ్రాంచ్‌కు చెందిన 8 బృందాలను విచారణకు ఏర్పాటు చేశారు. దీంతో ముంబై పోలీసులతో 7 బృందాలను ఏర్పడి కేసును దర్యాప్తు చేస్తున్నారు.
సైఫ్ అలీఖాన్‌పై జరిగిన దాడిపై మొత్తం 15 బృందాలు విచారణ జరుపుతున్నాయి. చోరీకి వచ్చిన దొంగే.. సైఫ్‌పై దాడి చేసినట్టు గుర్తించారు పోలీసులు. పక్క ఇంటి సీసీ ఫుటేజ్ ద్వారా ఓ వ్యక్తి సైఫ్ ఇంట్లోకి ప్రవేశించినట్టు ఆధారాలు సేకరించారు. నిందితుడు పారిపోతుండగా దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. త్వరలోనే నిందితుడిని పట్టుకుంటామంటున్నారు ముంబై పోలీసులు. ఇక ఈ దాడి లో సైఫ్ వెన్నెముకకు తీవ్రగాయమైందని వెల్లడించారు వైద్యులు.
సర్జరీ చేసి వెన్నెముక నుంచి రెండున్నర అంగుళాల కత్తిని తొలగించినట్లు వివరించారు. ఫ్లూయిడ్ లీకేజీని అరికట్టడానికి సైఫ్ వెన్నెముకకు మేజర్ సర్జరీ చేసినట్లు తెలిపారు. సైఫ్ అలీఖాన్ మెడ, ఎడమ చేతికి మరో రెండు ప్లాస్టిక్ సర్జరీలు చేసినట్లు వివరించారు.