సదా.. వారం రోజుల క్రితమే ఆయన చనిపోయారు కానీ, తాజాగా సదా ఈ విషయం గురించి ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో తెలిసింది. విషయం తెలియడంతో సదా స్నేహితులు, అభిమానులు, నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా సానుభూతి తెలియజేస్తున్నారు. అయితే ‘నాన్న చనిపోయి వారం రోజులైంది .. కానీ నాకు ఓ యుగం గడిచినట్లు అనిపిస్తుంది. సినిమా ఇండస్ట్రీ అనేది అమ్మాయిలకు ఏమంత సేఫ్ కాదు అనే రోజుల్లోనే అందరినీ ఎదిరించి మరీ నాకు అండగా నిలిచారు నాన్న.
అమ్మకు సమయం కుదరకపోవడం వల్ల నాతో పాటు షూటింగ్‌లకు రాలేకపోయేది. దీంతో నాన్న ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపారు. కొన్నేళ్ల పాటు నాతో కూడా షూటింగ్స్‌కి వచ్చారు. తిరిగి అమ్మ నా బాధ్యతల్ని తీసుకున్న తర్వాత నాన్న ఓ చిన్న క్లినిక్ ఓపెన్ చేశారు. మూగ జీవాలతో పాటు ఎంతో మందికి ఆపద్బాంధవుడు అయ్యారు. నేను తన కూతురు కావడం గర్వకారణం అని అందరూ ఆయనతో చెబుతున్నారని అనేవారు.
కానీ ఈ రోజు ఆయన కూతురిగా నేను ఉండటం గర్వకారణంగా భావిస్తున్నాను. తన చుట్టూ ఉన్నవాళ్ల కోసం ప్రేమ, ఆప్యాయతని పంచిన ఆయనని చూసి ఎంతో గర్వపడుతున్నాను. ఆయన నిజంగా ఓ వెలకట్టలేని మనిషి. మిస్ యూ డాడీ’ అని ఎమోషనల్ పోస్ట్ పెట్టింది సదా. ఇందులో తన తండ్రితో కలిసున్న కొన్ని ఫొటోలను కూడా షేర్ చేసిందీ అందాల తార. సదా షేర్ చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పలువురు సినీ ప్రముఖులు, స్నేహితులు, సన్నిహితులు, అభిమానులు, నెటిజన్లు సదాకు ధైర్యం చెబుతున్నారు.
ఆమె తండ్రి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తూ కామెంట్లు పెడుతున్నారు. కాగా మహారాష్ట్రకు చెందిన సదా తండ్రి ముస్లిం కాగా తల్లి హిందూ. సయ్యద్ డాక్టర్ గా సేవలందించారు. 2002లో జయం సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన సదా అనతికాలంలోనే క్రేజీ హీరోయిన్ గా ఎదిగింది. ప్రాణం, నాగ, దొంగా దొంగది, లీలా మహల్ సెంటర్, చుక్కల్లో చంద్రుడు, అపరిచితుడు, వీరభద్ర తదితర సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కొన్ని సినిమాల్లో సహాయక నటిగానూ మెరిసింది. అలాగే టీవీ షోస్, ప్రోగ్రామ్స్, ఈవెంట్స్ లోనూ సందడి చేసింది.