ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు స్టేషన్‌కు వస్తాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి జనరల్ బోగీ డోరు పట్టుకుని నిలబడతాడు. అప్పటికే అక్కడ కొంతమంది నిలబడి ఉంటారు. అయితే సోషల్ మీడియాక అందుబాటులోకి వచ్చాక రీల్స్ కోసం ప్లాట్‌ఫామ్ మీద స్టంట్స్ వేస్తూ చుట్టుపక్కల వారిని కూడా ప్రమాదాల బారిన పడేస్తుంటారు.
మరికొంత మంది త్వరగా గమ్యస్థానాలకు చేరుకోవాలనే ఆతృతలో కాళ్లు చేతులు విరగ్గొట్టుకుంటారు. అలాంటి షాకంగ్ సంఘటనలకు సబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆలాంటి వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఓ ముసలాయన రన్నింగ్ రైలు ఎక్కుతూ తాను పడిందే కాకుండా ఓ యువకుడిని సైతం కింద పడేశాడు. ఈ ఘటన కర్నాటకలో జరిగినట్లు తెలుస్తోంది.
ఓ వృద్దుడు రైలు ఎక్కేందుకు రైల్వే స్టేషన్‌కు చేరుకుంటాడు. అయితే అప్పటికే రైలు కదులుతుంటుంది. అయినా అతను రైలు ఎక్కేందుకు ప్రయత్నిస్తాడు. పరుగెత్తుకుంటూ వెళ్లి జనరల్ బోగీ డోరు పట్టుకుని నిలబడతాడు. అప్పటికే అక్కడ కొంతమంది నిలబడి ఉంటారు. ఈ క్రమంలో ఆ వృద్ధుడు బ్యాలెన్స్ తప్పి.. అక్కడున్న యువకుడిని పట్టుకుంటాడు. దీంతో ఇద్దరూ అదుపు తప్పి ఒక్కసారిగా కిందపడిపోతారు.
వారు కిందపడడం చూసిన వారంతా పరుగెత్తుకుంటూ వచ్చి పక్కకు లాగేస్తారు. దీంతో వారు ఎలాంటి గాయాలూ కాకుండా క్షేమంగా బయటపడతారు. కాగా, ఈ ఘటన మొత్తం అక్కడే ఉన్న వారు వీడియో తీసి, సోషల్ మీడియాలో షేర్ చేశారు.