తమ టాలెంట్ ను ప్రతి ఒక్కరు వీడియోలు, రీల్స్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. దెబ్బకు అవి వైరల్గా మారిపోతున్నాయి. దీంతో ఓవర్ నైట్ లో చాలా మందికి పబ్లిసిటీ వస్తుంది. సోషల్ మీడియా ప్రచారం ఒక రేంజ్ లో ప్రస్తుతం ఉంటుంది. అయితే చంద్రిక గేరా దీక్షిత్ అనే ఢిల్లీకి చెందిన ‘వడ పావ్ అమ్మాయి’ ఎవరో తెలియదు. చంద్రిక ఢిల్లీలోని ఒక స్టాల్ నుండి ముంబైకి చెందిన వడ పావ్‌ను విక్రయించడం ప్రారంభించింది. దీనికి సంబంధించి వీడియో అతి కొద్దికాలంలోనే వైరల్‌గా మారింది. ఆమె తన వీడియోలను సోషల్ మీడియాలో ఎక్కువగా పంచుకునేది.. దాని ఫలితంగా ఆమెకు బిగ్ బాస్ OTT నుండి ఆఫర్ కూడా వచ్చింది.
అయితే ఆహార పదార్థాలను అమ్ముతూ వైరల్‌గా మారిన వారిలో చంద్రిక మాత్రమే కాదు. చాలా మంది ఇలా తమ వీడియోలను సోషల్ మీడియాలో వైరల్ అయి.. రాత్రికి రాత్రే ఫేమస్ అయిన వారు చాలా మంది ఉన్నారు. ఇప్పడు ఇక్కడ ఓ అమ్మాయి కూడా ఇలానే రోడ్డు సైడ్ పరోటా అమ్ముతూ వైరల్ అయిపోయింది. అమ్మాయి రోటీతో ఉన్న వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అమ్మాయి కొన్నిసార్లు అరటిపండు పరోటా, కొన్నిసార్లు గుడ్డు పరోటా చేస్తుంది. కొన్నిసార్లు ఆమె ప్రజలకు జ్యూస్ కూడా విక్రయిస్తుంది. ఈ వీడియోను PUY ROTI LADY ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
Pui థాయ్‌లాండ్‌కి చెందినది. ఆమె పరోటాలను విక్రయిస్తుంది. అయితే ఆమెను చూడటానికి చాలా మంది ఆ బండి వద్దకు వస్తున్నారు. ఆమె పరోటాల విక్రయించడంతో పాటు.. ఆమె డ్రస్సింగ్ స్టైల్ చూసి కూడా వస్తున్నారు. ఓ రొమాంటిక్ లుక్ లో ఆమె కనిపిస్తుండటంతో.. చాలా మంది అక్కడకు వచ్చేందకు ఆసక్తి చూపుతున్నారు. ఈ వీడియోలో ఈ అమ్మాయి పల్చని కాగితంలా పిండిని ఎలా చుట్టిందో చూడొచ్చు. ఆమె రొమాంటిక్ బ్రెడ్ తయారు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఆమె దానిని పాన్‌లోని నూనెపై వేసింది. . దీని తర్వాత ఆమె దానిపై ఒక గుడ్డును పగలగొట్టి బాగా ఉడికించింది.
అది పూర్తిగా కరకరలాడే విధంగా చేసి.. తర్వాత, దానిపై క్రీమ్, ఉప్పు వేసి కాగితంలో చుట్టింది. దీని తర్వాత ఆమె దానిని కస్టమర్‌కు తినడానికి ఇస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మాయి వీడియో వైరల్ అవుతోంది. కొద్ది గంటల్లోనే ఈ అమ్మాయి వీడియోకు 5లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి. వేల మంది దీన్ని లైక్ చేయడంతో పాటు కామెంట్స్ కూడా వస్తున్నాయి.