స్వచ్ఛంద సంస్థలు జన విజ్ఞాన వేదికలు అధికారులు మూఢనమ్మకాలపై ఎంతగానో అవగాహన కార్యక్రమాలు చేపట్టినా ప్రజలు మూఢనమ్మకాల వైపే వెళ్తున్నారు క్షుద్ర పూజలు చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళ్తే..
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ఎస్సారెస్పీ ఆఫీసు సమీపంలోని రోడ్డుపై క్షుద్ర పూజలు చేశారు గుర్తు తెలియని వ్యక్తులు, విస్తారాకులో అన్న ముద్దలకు పసుపు, కుంకుమ పట్టించి, నిమ్మకాయలు, కొబ్బరికాయను పెట్టారు గుర్తు తెలియని వ్యక్తులు. అయితే నివాస ప్రాంతాల్లో ఈ క్షుద్ర పూజలు చేయడం పట్ల స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ఆది, గురువారాల్లో క్షుద్ర పూజలు నీరుకుల్ల రోడ్డులో ఎక్కువగా చేస్తున్నారు భూతవైద్యులు. ఎవరైనా అనారోగ్యం బారిన పడితే వారిపై నుంచి తిప్పి వీటిని రోడ్డుపై పెడుతున్నారని స్థానికులు అంటున్నారు. రాత్రిపూట వీటిపై నుంచి ఎవరైనా దాటితే అనుమానంతో ఏదో అవుతోందని భయాందోళన చెందుతున్నారు.
అయితే ఈ ప్రాంతంలో ఉదయం పూట మార్నింగ్ వాకింగ్ వెళ్లే వాళ్ళు కూడా భయంతో వణికిపోతున్నారు. సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందినప్పటికీ ప్రజలు ఇంకా మూఢనమ్మకాలను నమ్మొద్దని జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు అంటున్నారు.