అమన్ జైస్వాల్ ఒక కొత్త టీవీ షోలో నటించినందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆడిషన్ ఇవ్వడం కోసం బైక్ మీద అతను ట్రావెల్ చేస్తుండగా వెనుక నుంచి వచ్చిన ఒక ట్రక్కు బలంగా ఢీ కొట్టడంతో ప్రాణాలు కోల్పోయాడని ముంబై వర్గాల ద్వారా తెలిసింది. అయితే అమన్ జైస్వాల్ ఉత్తరప్రదేశ్‌లోని బల్లియా నివాసి. ‘ధర్తిపుత్ర నందిని’ చిత్రంలో అమన్ ప్రధాన పాత్రలో కనిపించారు.
సోనీ టీవీ సీరియల్ ‘ పుణ్యశ్లోక్ అహల్యాబాయి’లో యశ్వంత్ రావు పాత్రను అమన్ పోషించారు . 2021లో ప్రారంభమైన ఈ సీరియల్ 2023లో ముగిసింది. అమన్ మోడలింగ్‌తో తన కెరీర్‌ను ప్రారంభించాడు. అమన్‌కి బైక్ నడపడం అంటే చాలా ఇష్టం. ఎక్కడికైనా బైక్‌పై వెళ్లేవాడు. ఇన్‌స్టాగ్రామ్‌లో అతని చాలా వీడియోలు బైక్ రైడింగ్ ఉన్నాయి. అతను మంచి గాయకుడు కూడా. అమన్ అకాల మరణంపై బుల్లితెర నటీనటులు, అభిమానులు తీవ్ర దిగ్ర్బాంతి వ్యక్తం చేస్తున్నారు.
అమన్ స్నేహితుడు అభినేష్ మిశ్రా మాట్లాడుతూ… అమన్ బైక్ ప్రమాదానికి గురైందని తెలిసిన వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తీసుకెళ్లారని.. అయితే ఆసుపత్రికి చేరిన అరగంటకే అతడు మృతి చెందినట్లు తెలిపాడు. ఆడిషన్ కోసం స్క్రీన్ టెస్ట్ షూట్ చేయడానికి అమన్ సెట్స్‌కి వెళ్లాడని.. అక్కడి నుంచి తిరిగి వస్తున్న సమయంలోనే యాక్సిడెంట్ జరిగినట్లు తెలిపారు. ధర్తీపుత్ర నందిని సీరియల్ కంటే ముందు అమన్ చాలా సీరియల్స్ లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు.