కాంతార దూకుడు చూసిన వారు అసలు రిషబ్‌శెట్టి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారని తెలుసుకోవడానికి మరింత ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంటికి సంబంధించిన పలు విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాంతార చిత్రానికి హీరోగా.. దర్శకుడిగా పనిచేశారు రిషబ్ శెట్టి. ఇక ఆయన సతీమణి మాత్రం తెర వెనుక కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేశారు.
క్రియేటివ్ ఇన్పుట్స్ మట్టి బట్టల నుంచి పౌరాణిక స్వరాన్ని నిర్వహించే రాచరికపు డిజైన్స్ వరకు ప్రతి ఫ్రేమ్ కు కావాల్సిన.. అవసరమైన విధంగా ఆమె కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. అలాగే కాంతార సినిమాల్లో ఆమె అతిథి పాత్రలలో కనిపించింది. అలాగే రిషబ్ శెట్టి కుమారుడు రణవిత్ సైతం కాంతార చాప్టర్ 1లో కనిపించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి మాట్లాడుతూ.. కాంతార సినిమా ప్రయాణంలో తన భార్య అందించిన సపోర్ట్ గురించి భావోద్వేగ స్పీచ్ ఇచ్చారు.
తాను షూటింగ్ కోసం బయటకు వచ్చిప్పుడల్లా .. తన భార్య దేవుడిని వేడుకునేదని .. తన భార్య ప్రగతి లేకపోతే సినిమాను పూర్తిచేయలేకపోయేవాడినని అన్నారు. రిషబ్ శెట్టి, ప్రగతి మొదట్లో సినిమా కార్యక్రమాల్లో కలుసుకున్నారు. ఆ తర్వాత కొన్నాళ్లకు ఫేస్ బుక్ లో స్నేహితులయ్యారు. వీరి స్నేహం ప్రేమగా మారింది. మొదట్లో రిషబ్ సినిమాల్లో విజయం సాధించకపోవడంతో ప్రగతి తల్లిదండ్రులు మొదట్లో ఈ వివాహాన్ని వ్యతిరేకించారు.
కానీ చివరకు వీరిద్దరు పెద్దల సమక్షంలో 2017లో పెళ్లి చేసుకున్నారు. వీరికి 2019లో బాబు రణవిత్ జన్మించారు. ఆ తర్వాత 2022లో కుమార్తె రాధ జన్మించింది. రిషబ్ శెట్టి భార్య ప్రగతి మొదట్లో కాస్ట్యూమ్ డిజైనర్. బెల్ బాటమ్ (2019)తో ఆమె ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. అక్కడ ఆమె మొదటిసారి రిషబ్‌తో కలిసి పనిచేసింది. ఆమె కాంతారా (2022), కాంతార చాప్టర్ 1లకు పనిచేసింది.